కాకినాడ జిల్లాకు మరో గుడ్ న్యూస్. ఇటీవల కాలంలో భారీగా చేపట్టిన ఉద్యోగమేళాలతో పోలిస్తే ఈ నెల 28న జరిగే భారీ జాబ్‌మేళాకు రంగం సిద్ధమైంది. కాకినాడలోని పిఠాపురం పాలిటెక్నిక్ కళాశాల ఇందుకు వేదిక కాబోతుంది. జాబ్‌మేళాకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.
కాకినాడలోని వికాస కేంద్రం ఆధారంగా జరిగే ఈ జాబ్‌మేళాను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి భారీగా నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించే యోచనలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక్కడకు వచ్చిన నిరుద్యోగులు సంతృప్తి చెందేలా, జాబితాలో పేర్కొన్న అన్ని కంపెనీల ప్రతినిధులు వచ్చేలా చూస్తున్నారు. ఈసారి వేదిక పిఠాపురం పాలిటెక్నిక్ కళాశాల కాబోతుంది. సాఫ్ట్ వేర్, పారిశ్రామిక రంగం, ఆటో మొబైల్, ఫైనాన్స్ రంగాల్లో వివిధ పలు పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇందుకు ఆయా విభాగాల అవసరాలను బట్టి విద్యర్హతను నిర్ణయించారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయితోపాటు, ఇంజనీరింగ్ డిప్లమో, బిటెక్, ఎమ్‌టెక్ చదివిన విద్యార్థులు, సైన్సు విభాగాల్లో డిగ్రీ, పీజీలు చేసిన వారికి పోస్టులు ఉన్నాయి.
కంపెనీలు ఇవే..
ఏపీలో పేరుగాంచిన డెక్కన్ ఫైన్ కెమికల్స్, కియా మోటార్సు, గ్రీనిచ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వీల్స్ ఇండియా, ఐసోన్ ఎక్స్‌ప్రెస్, పేటీఎమ్, మెడ్ ప్లస్ ఫార్మా, అపోలోఫార్మాసీ, గోపాల్ ఆటోమొబైల్, మోహన్ స్పిన్ టెక్ట్స్, హెల్ప్ యువర్ నీడ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ తదితర కంపెనీల్లో బీపీవో దగ్గర నుండి ఇంజనీర్ వరకూ పోస్టుల ఖాళీలు చూపిస్తున్నారు.
ఇంటర్వ్యూ పెర్‌ఫార్మెన్స్ ఆధారంగా వీరికి జీత భత్యాలు నిర్ణయిస్తారు. ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల నుండి రూ. 50 వేల వరకూ జీతం ఉంటుంది. ఆయా విభాగాలలో ప్రతిభ ఆధారంగా ఇంటర్య్యూ చేసి జీత భత్యాలను నిర్ణయిస్తారు. మొత్తం ప్రక్రియ ఒక్క రోజులోనే పూర్తయ్యేలా చేస్తున్నారు అధికారులు. అభ్యర్థులు తమ విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నింటిని రెండు సెట్స్ తీసుకెళ్లాలని తెలిపారు.
ఒరిజనల్ సర్టిఫికెట్స్‌కు కూడా చూపించాల్సి ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైతే బాండ్ రాయాల్సి ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకైతే కేవలం జిరాక్స్ కాపీలను చూపించినా సరిపోతుంది. ఏడాదిలో భారీగా చేపట్టిన జాబ్‌మేళా జాబితాలో ఈసారి చేపట్టబోయే జాబ్‌మేళా మెండుగా ఉండాలని కలెక్టర్ సూచించారు. భారీ రిక్రూట్‌మెంట్ చేసేందుకు ప్రస్తుతం ఉన్న కంపెనీలతోపాటు మరికొన్ని కంపెనీలు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద నిరుద్యోగులకు మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
No comments:
Post a Comment