తెలంగాణలో కొనసాగుతోన్న కొలువుల జాతరలో భాగంగా ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ముగియగా.. గ్రూప్-2, గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. రేపటితో గ్రూప్-3 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ముగియనుంది.
తెలంగాణలో మొత్తం 1363 గ్రూప్-3 (TSPSC Group-3)పోస్టుల భర్తీకి డిసెంబర్ 30న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ (TSPSC) విడుదల చేసింది. అయితే.. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను జనవరి 24న ప్రారంభించారు అధికారులు. అయితే.. కొన్ని రోజుల క్రితం టీఎస్పీఎస్సీ గ్రూప్-3 పోస్టులకు సంబంధించి ఉద్యోగ ఖాళీలను పెంచుతూ వెబ్ నోట్ విడుదల చేసింది. బీసీ గురుకులాల్లో గ్రూప్-3 కింద 12 పోస్టులను పెంచుతూ వెబ్ నోట్ విడుదల చేసింది. ఈ 12 పోస్టులు మహాత్మాజ్యోతిబాఫూలే గురుకులకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఈ పోస్టులకు అర్హతగా.. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారుగా పేర్కొన్నారు. కొత్తగా చేర్చిన 12 పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-3లో పోస్టుల సంఖ్య 1,375కి పెరిగింది. ఇదిలా ఉంటే.. గ్రూప్-3 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే.. ఫిబ్రవరి 23న ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపు సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో తమ దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు ఈ https://group3appl2546825.tspsc.gov.in/CandidateEntry292022 లింక్ తో కూడా నేరుగా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజుగా.. రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.80 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 105 కేటగిరీల్లోని పోస్టులను భర్తీ చేస్తోంది టీఎస్పీఎస్సీ. ఇందులో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇంకా రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులుగా నిర్ణయించారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు ఉంటాయి. ఇంకా.. పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ)-150 ప్రశ్నలు, పేపర్-3(ఎకానమీ & డెవలప్‌మెంట్)-150 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ప్రిపరేషన్ కి సంబంధించిన నోట్స్ ఈ లింక్ లో లభించే అవకాశం వుందా.
ReplyDelete