బ్యాంక్ జాబ్ కోరుకునేవారికి అలర్ట్. ఐడీబీఐ బ్యాంకులో (IDBI Bank) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. మొత్తం 114 పోస్టులున్నాయి. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకులో 600 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 114 పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2023 మార్చి 3 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
ఖాళీల వివరాలివే
మేనేజర్ 75 | |||
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 29 | |||
డిప్యూటీ జనరల్ మేనేజర్ 10
గుర్తుంచుకోవాల్సిన అంశాలుదరఖాస్తు ప్రారంభం- 2023 ఫిబ్రవరి 21 దరఖాస్తుకు చివరి తేదీ- 2023 మార్చి 3 విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. బీసీఏ, బీఎస్‌సీ (IT), బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్‌సీ (IT), ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, ఎంఏ, ఎంఎస్‌సీ లాంటి కోర్సులు పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. వయస్సు- 25 ఏళ్ల నుంచి 45 ఏళ్లు. దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ.200. వేతనం- డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు రూ.89,892. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుకు రూ.78,230. మేనేజర్ పోస్టుకు రూ.69,810. ఐడీబీఐ బ్యాంకు స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. |
No comments:
Post a Comment