తెలంగాణలో వరుస నోటిఫికేషన్లు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఇటీవల సింగరేణి, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. తాజాగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దీని నుంచి జూనియర్ లైన్‌మెన్, అసిస్టెంట్ ఇంజనీర్ నియామకాలకు సంబంధించి రెండు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. మొత్తం 1,601 పోస్టులున్నాయి. అందులో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్టులు 48 కాగా, జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 1553.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం జూనియర్ లైన్‌మెన్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు మార్చి 8 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు మార్చి 28 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ఆన్‌లైన్‌లో ఫారమ్ నింపాల్సి ఉంటుంది. అభ్యర్థులు TSSPDCL వెబ్‌సైట్ tssouthernpower.cgg.gov.inని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక జూనియర్ ఇంజనీర్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.64,295 బేసిక్ వేతనంతో మొత్తం రూ.99,345 వేతనం లభిస్తుంది.
అర్హత ప్రమాణాలు 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు లైన్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్‌లో అర్హత కలిగి ఉండాలి. ఇది కాకుండా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు మాత్రమే జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ లైన్‌మెన్ పోస్టుకు నియమితులయ్యే అభ్యర్థులకు ప్రాథమిక వేతనంగా రూ.39,000 లభిస్తుంది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి. దీంతోపాటు పరీక్ష ఫీజుగా రూ.120 కూడా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రూ.320 చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/BC కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
No comments:
Post a Comment