Mother Tongue

Read it Mother Tongue

Thursday, 23 February 2023

టెన్త్ అర్హతతో 11,409 జాబ్స్... రేపే లాస్ట్ డేట్... ఇదే అప్లై లింక్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (Central Govt Jobs) కోరుకునే నిరుద్యోగులకు అలర్ట్. టెన్త్ పాస్ అయినవారు 11,409 ఉద్యోగాలకు అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువు ఉంది. జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,409 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు 10880 ఉండగా, హవల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. 2023 ఫిబ్రవరి 17న దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.  అయితే అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దరఖాస్తు చివరి తేదీని 2023 ఫిబ్రవరి 24 వరకు పొడిగించింది. దరఖాస్తు గడువుతో పాటు ఇతర ముఖ్యమైన తేదీలను కూడా పొడిగించింది. అభ్యర్థులు 2023 ఫిబ్రవరి 24 రాత్రి 11 గంటల లోగా దరఖాస్తు చేయాలి. న్‌లైన్ ఫీజ్ పేమెంట్ 2023 ఫిబ్రవరి 26 రాత్రి 11 గంటల లోగా చేయాలి. ఆఫ్‌లైన్ చలానా 2023 ఫిబ్రవరి 26 రాత్రి 11 గంటల లోగా జనరేట్ చేయాలి. 2023 ఫిబ్రవరి 27 బ్యాంకు వేళలు ముగిసేలోగా ఆఫ్‌లైన్ చలానా చెల్లించాలి. దరఖాస్తు ఫామ్‌ను కరెక్షన్ చేయడానికి 2023 మార్చి 2 నుంచి మార్చి 3 రాత్రి 11 గంటల వరకు అవకాశం ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2023 ఏప్రిల్‌లో ఉంటుంది.  కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అభ్యర్థులు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం లాంటి 13 ప్రాంతీయ భాషల్లో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు ఎలా దరఖా స్తు చేయాలో తెలుసుకోండి.  అభ్యర్థులు ముందుగా https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో New User ? Register Now పైన క్లిక్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డిక్లరేషన్ ఫిల్ చేయాలి. మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత దరఖాస్తు చేయడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత అభ్యర్థి వివరాలు డిస్‌ప్లేలో కనిపిస్తాయి. ఆ వివరాలన్నీ సరిచూసుకోవాలి. ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్ చేయొచ్చు. ఆ తర్వాత కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్-CHSL నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయాలి. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. గతంలోనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసినవారు నేరుగా లాగిన్ అయి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. 

రిజిస్ట్రేషన్  లాగిన్ 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials