Mother Tongue

Read it Mother Tongue

Saturday, 11 March 2023

టీఎస్పీఎస్సీలో ప్రశ్నా పత్రాల హ్యాకింగ్ కలకలం.. ఆ నియామక పరీక్షలన్నీ వాయిదా..

 తెలంగాణలో భారీగా ఉద్యోగ నియామకాలు (Telangana Government Jobs) జరుగుతున్న వేళ ప్రశ్నాపత్రాల హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. హ్యాకింగ్ జరిగిందని అనుమానంతో రేపు అంటే ఈ నెల 12వ తేదీతో పాటు.. 15,16 వ తేదీల్లో జరగాల్సిన అన్ని నియామక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రకటన విడుదల చేసింది. ఈ అంశంపై పోలీసు కేసు నమోదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 12న జరగాల్సి ఉన్న టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగ నియామక పరీక్షను.. ఇంకా.. ఈ నెల 15, 16 తేదీల్లో జరగాల్సి ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామమని ప్రకటనలో పేర్కొన్నారు

Job Alerts and Study Materials