Mother Tongue

Read it Mother Tongue

Saturday, 1 April 2023

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..


 ఇండియన్ రైల్వే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నార్త్ వెస్టర్న్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 238 పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్ డిపార్ట్ మెంట్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ (GDCE) అభ్యర్థులను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమించనుంది. దీనిలో ఎంపికైన అభ్యర్థులు నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా రాత పరీక్ష, సర్టిఫికేట్ల పరీశీలన, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. లెవల్ గ్రేడ్ 2 పే లెవల్ అధారంగా శాలరీ ఉంటుంది. మొత్తం 238 పోస్టుల్లో జనరల్ కేటగిరీ కింద 120, ఎస్సీ 36, ఎస్టీ 18, ఓబీసీ కింద 64 పోస్టులను కేటాయించారు.

ముఖ్యమైన తేదీలు 

  • ఏప్రిల్ 07 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది
  • మే 06, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

వయోపరిమితి 

  • కనిష్ట వయస్సు 15 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది

విద్యార్హత

  • అభ్యర్థులు పదో తరగతితో పాటు.. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి
  • అభ్యర్థుల యొక్క మెడికల్ స్టాండర్డ్ ఏ 1గా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు

దరఖాస్తు రుసుము

  • దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

అధికారిక వెబ్సైటు

  • పూర్తి వివరాలకు http://www.rrcjaipur.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు

లక్షల్లో ఉద్యోగాలు ఉన్నాయి.. దరఖాస్తు చేసారా.. చేయకపోతే ఇక్కడ క్లిక్ చేసి చేసుకొండి
స్టడీ మెటీరియల్స్ ను పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
అతి ముఖ్యమైన కరెంటు అఫైర్స్ ను మాత్రమే పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts and Study Materials