
తెలంగాణలో టీచర్ ఉద్యోగ నియామకాలకు (Telangana Teacher Recruitment) సంబంధించిన నోటిఫికేషన్ ను (TS DSC 2023 Notification) విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. మొత్తం 5089 ఖాళీలను (Teacher Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇన్ఫర్మేషన్ బులిటెన్ సైతం ఈ నెల 20 నుంచి అధికారిక వెబ్ సైట్లో (https://schooledu.telangana.gov.in/ISMS/) అందుబాటులో ఉంటుంది. అందులోనే పూర్తి విద్యార్హతల వివరాలు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారికి నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు రాత పరీక్షను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహహించనున్నారు. నియామక పరీక్షను మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ , మెదక్, ఆదిలాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం , నల్గొండలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఉద్యోగ ఖాళీలు 5089
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం
- దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు
- నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు రాత పరీక్షను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహహించనున్నారు.
దరఖాస్తు రుసుము
- దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది
వయోపరిమితి
- అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1వ తేదీ నాటికి 18-44 ఏళ్లు ఉండాలి.
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వరకు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు&సాయుధ దళాలలో చేసిన సర్వీస్ కాలం, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, శారీరక దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో పదేళ్ల పాటు సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి