Mother Tongue

Read it Mother Tongue

Friday, 14 June 2024

రాత పరీక్ష లేకుండానే DRDOలో ఉద్యోగాలు.. నెలకు రూ. 37000 జీతం

 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో ఉద్యోగం పొందాలనుకునే వారికి శుభవార్త.

DRDO Recruitment 2024: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో ఉద్యోగం పొందాలనుకునే వారికి శుభవార్త.  DRDO.. జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జూన్ 19.

విద్యార్హత

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మొదటి డివిజన్‌తో కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో ME/M.Tech కలిగి ఉండాలి.

 వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 28 ఏళ్లు ఉండాలి. అలాగే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/STలకు 05 సంవత్సరాలు, OBCలకు 03 సంవత్సరాలు సడలింపు ఇవ్వబడుతుంది.

జీతం

ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు జీతం రూ. 37000, HRA చెల్లించబడుతుంది.

దరఖాస్తు చేయడానికి లింక్, నోటిఫికేషన్ ఇక్కడ ఉంది

DRDO Recruitment 2024 నోటిఫికేషన్ DRDO Recruitment 2024అప్లయ్ చేయడానికి లింక్

ఎంపిక ప్రక్రియ

DRDO యొక్క ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

తేదీ: 19-06-2024 & 20-06-2024

రిపోర్టింగ్ సమయం: 08:30 AM నుండి 10:00 AM వరకు

వేదిక: DGRE చండీగఢ్



Job Alerts and Study Materials