Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 5 April 2023

9,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

 తెలంగాణలో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలు కొలువులకు నోటిఫికేషన్లు జారీ అవ్వగా.. తాజాగా గురుకులాల్లో 9 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (TREI-RB) కీలక అడుగు వేసింది. నోటిఫికేషన్ విడుదల చేపి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది. నిజానికి గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ ఖాళీలకు ఏకకాలంలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని గతంలోనే ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ లోనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని అంతా భావించారు కూడా. దీనికి సంబంధించి అంతర్గత పరిశీలన నాలుగు నెలల ముందే పూర్తయిందని వార్తలు వచ్చాయి. 9వేలకు పైగా పోస్టులకు సంబంధించి గురుకుల సొసైటీలు టీఆర్‌ఈఐఆర్‌బీ (ట్రిబ్‌)కు సమర్పించగా.. రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లు, ఇతర అంశాలపై లోతుగా పరిశీలన చేయ్యగా తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. కాస్త ఆలస్యమైనా పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీతో నిరుద్యోగులకు సైతం ఉత్సాహం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ కేటగిరీల్లో వేరువేరు విభాగాలకు చెందిన పోస్టులు ఎన్ని ఉన్నాయో TREI-RB నోటిఫికేషన్ లో చెప్పింది.. 9,231లో 4, 021 పోస్టులు ట్రైనిడ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ వే ఉన్నాయి.. 2,008 జాబ్స్ జూనియర్ లెక్చరర్స్/ ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజ్స్ వి ఉన్నాయి.. వీటితోపాటు ప్రిన్సిపల్, డిగ్రీ లెక్చరర్, పీఈటీ తదితర కేటగిరీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.. పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్స్(1,276), లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్ (434), ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్ (275), డ్రాయింగ్ టీచర్స/ఆర్ట్ టీచర్స్(134), క్రాఫ్ట టీచర్స్ (92), మ్యూజిక్ టీచర్స్ (124) ఇలా వివిధ కేటగీరిల్లోని ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో భాగంగా గురుకుల విద్యా సంస్థల్లో 9 వేలకు పైగా ఖాళీలను ప్రభుత్వం నోటిఫై చేసింది. నిజానికి గురుకులాల్లో టీజీటీ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత శిక్షణ కేంద్రంలో నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. దాదాపు ఏడు నెలలుగా నోటిఫికేషన్లు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. తాజా ప్రకటనలో ఇప్పటి వరకు నిరుత్సాహానికి గురైన అభ్యర్థులు కాస్త రిలేక్స్ అయ్యారు.. అయితే మరో మూడు వేల పోస్టులు అదనంగా భర్తి చేస్తారన్న ప్రచారంపై ఎలాంటీ క్లారిటీ ఇవ్వలేదు బోర్డు.


మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి



17 comments:

Job Alerts and Study Materials