Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 31 July 2024

HUDCO లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

 హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HUDCO) లో 66 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఆన్లైన్ లో అప్లికేషన్ కు చివరితేది ఆగష్టు 11, 2024. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి. 

ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్ ఫలితాలు.. లింక్ ఇక్కడే!

 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజనీరింగ్ సర్వీసెస్ ఫలితాలను విడుదల చేసింది. 

ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి రూల్ నెంబర్ ప్రకారం, నేమ్ ప్రకారం

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి  



కోటి మందికి ఇంటర్న్‌షిప్.. యువతకు భారీ శుభవార్త

 కేంద్ర బడ్జెట్‌లో నైపుణ్యాభివృద్ధి కోసం ‘వాలంటీర్ కోటా సిస్టమ్’ పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రోగ్రామ్ కింద 500 మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కల్పించడానికి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్‌మైట్రిప్ (EaseMyTrip) ముందుకు వచ్చింది.

యువతలో స్కిల్స్ పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో నైపుణ్యాభివృద్ధి కోసం ‘వాలంటీర్ కోటా సిస్టమ్’ పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్‌ను ప్రతిపాదించింది. దీనిపై ఏకంగా రూ.2 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేయనుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా దేశంలోని టాప్ 500 కంపెనీల్లో కోటి మందికి పైగా యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించనున్నారు. ఈ ప్రోగ్రామ్ కింద 500 మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కల్పించడానికి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్‌మైట్రిప్ (EaseMyTrip) ముందుకు వచ్చింది.

కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిన్న న్యూఢిల్లీ వేదికగా ‘జర్నీ టువర్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25’ పేరుతో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ప్రధాని మోదీ కాన్ఫరెన్స్ ప్రారంభ సెషన్‌లో పాల్గొన్నారు. ఆ తరువాత EaseMyTrip సీఈవో, కో-ఫౌండర్ నిషాంత్ పిట్టి ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేశారు.

500 కంటే ఎక్కువ ఇంటర్న్‌లు

“2025 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన కొత్త ఉపాధి పథకం కింద, మా కంపెనీ దేశవ్యాప్తంగా 500+ ఇంటర్న్‌లను రిక్రూట్ చేసుకోనుంది. ఈ చొరవ ప్రభుత్వం ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఆలోచనలకు మద్దతుగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కోసం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మేం అభినందనలు తెలుపుతున్నాం.’’ అని నిషాంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్రావెల్ రంగంలో కొత్త బెంచ్‌మార్క్

తమ బృందంలో 500 కంటే ఎక్కువ ప్రతిభావంతులైన వ్యక్తులను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు నిషాంత్ చెప్పారు. హ్యూమన్ క్యాపిటల్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మనదేశంలో ట్రావెలింగ్ ఇండస్ట్రీ కొత్త బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. యువతను సాధికారత, ఆవిష్కరణల వైపు నడిపిస్తే దేశాభివృద్ధికి కృషి చేస్తారని నిషాంత్ వివరించారు.

ఉపాధితో పాటు ఆవిష్కరణలకు ఊతం

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రకటించిన తర్వాత 500 మంది ఇంటర్న్‌ల నియామకాన్ని ప్రకటించిన మొదటి కంపెనీగా EaseMyTrip నిలిచింది. రోబోయే రోజుల్లో ఈ సంస్థ చేపట్టే భారీ నియామకాలు ఇండియన్ టూరిజం, ట్రావెలింగ్ ఇండస్ట్రీపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. యువ ప్రతిభను వెలికితీయడం ద్వారా బ్రాండ్ మార్కెట్‌లో ఉపాధిని సృష్టించవచ్చు. అదే సమయంలో సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుంది.

EaseMyTrip సంస్థను 2008లో నిశాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టి స్థాపించారు. హోటల్ బుకింగ్స్, విమాన టిక్కెట్లు, దేశీయ, అంతర్జాతీయ హాలిడే ప్యాకేజీలు, బస్సు బుకింగ్స్, వైట్-లేబుల్ వంటి సేవలను ఈ సంస్థ అందిస్తోంది. సింగపూర్, UAE, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో ఆఫీస్‌లు ఉన్నాయి. ఆ దేశాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్స్‌ను రన్ చేస్తోంది.



ఆ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తులు.. జీతం రూ.50 వేలు..

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేఫన్ ద్వారా గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేఫన్ ద్వారా గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దరఖాస్తు చేసే అభ్యర్థులు యూజీసీ నెట్ అర్హత సాధించి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మాస్టర్ డిగ్రీలో 55 శాతం మార్కులు ఉండాలి.

లేదా తత్సమాన డిగ్రీ/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/సీఏ/పీజీడీఎం/ఐసీడబ్ల్యూఏ/ఎం.కామ్ / ఎంఏలో డిగ్రీతో పాటు రెండేళ్ల టీచింగ్‌ అనుభవం తప్పనిసరి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులు తమ జిరాక్స్ సర్టిఫికేట్లను ‘స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్,హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ’కి పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది. లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఈ మెయిల్ head.deet@uohyd.ac.in కు ఆన్ లైన్ లో సర్టిఫికెట్లు పంపించవచ్చు.

హిందీ విభాగానికి సంబంధించి దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 5 వరకు సమయం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేలు వేతనం అందిస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు https://uohyd.ac.in/ వెబ్ సైట్లో తెలుసుకోవచ్చు.



Tuesday, 30 July 2024

ICAR – IARI అసిస్టెంట్ ఫలితాలు.. లింక్ ఇక్కడే!

 ICAR – IARI అసిస్టెంట్ ఫలితాలు వెలువడినాయి. ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



భారీగా ఉద్యోగాలు.. ఆ రంగంపై స్పెషల్ ఫోకస్.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

 కరోనా సమయంలో ఎదురైన సవాళ్లను భారత్‌ అధిగమించిన తీరును, ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న విధానాన్ని ప్రధాని మోదీ మరోసారి నొక్కిచెప్పారు. మంగళవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ‘జర్నీ టువర్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్’ ప్రారంభ సెషన్‌లో ఆయన ప్రసంగించారు. కోట్లాది ఉద్యోగాలు సృష్టిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) రంగంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.

గత దశాబ్దంలో భారతదేశంలో తయారీ రంగం ఎంతో వృద్ధి సాధించిందని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ఎక్కువ ఉద్యోగాలు సృష్టించిందని ప్రధాని చెప్పారు. CII పోస్ట్‌ బడ్జెట్‌ కాన్ఫరెన్స్‌లో మోదీ ప్రసంగంలోని కీలక విషయాలు చూద్దాం.

* మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే లక్ష్యం

భారతదేశంలో ఇప్పుడు 1.40 లక్షల స్టార్టప్స్ ఉన్నాయని, 8 కోట్ల మంది ప్రజలు ముద్ర రుణాలతో తమ వ్యాపారాలను ప్రారంభించారని ప్రధాని మోదీ చెప్పారు. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) నిర్మాణానికి ప్రభుత్వ నిబద్ధతను నొక్కిచెప్పారు. ఎన్డీయే మూడో టర్మ్‌లో భారతదేశాన్ని ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని మరోసారి స్పష్టం చేశారు.

* మూడు రెట్లు పెరిగిన బడ్జెట్‌

ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో గడిచిన 10 ఏళ్లలో బడ్జెట్ పరిమాణం మూడు రెట్లు పెరిగి రూ.48 లక్షల కోట్లకు చేరుకుందని మోదీ పేర్కొన్నారు. మహమ్మారి వల్ల ఎదురైన సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 8% వృద్ధి నమోదు చేస్తోందని, భారతదేశం త్వరలో మొదటి మూడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మూలధన వ్యయం ఐదు రెట్లు పెరిగిందని, గత దశాబ్దంలో రూ.11.11 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు.

‘25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. జీవన సౌలభ్యం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాం. అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం కలిగిన ఏకైక దేశం భారతదేశం. ప్రపంచ వృద్ధికి 16% దోహదపడుతున్నాం. ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగం, స్కేల్‌తో అపూర్వమైన రికార్డులను నెలకొల్పింది.’ అని పేర్కొన్నారు.

* 8 శాతం వేగంతో దేశాభివృద్ధి

అంతేకాకుండా, పన్ను రేట్లు గణనీయంగా తగ్గాయని, మంత్రిత్వ శాఖలకు కేటాయింపులు గత దశాబ్దంలో రికార్డు స్థాయిలో పెరిగాయని ప్రధాని మోదీ సూచించారు. కరోనా సమయాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘మహమ్మారి సమయంలో మేము వివిధ వర్గాలతో చర్చలు జరిపాం. ఆ చర్చల ప్రధాన ఉద్దేశం ‘వృద్ధిని తిరిగి పొందడం’. భారతదేశం అతి త్వరలో అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని నేను అప్పుడు చెప్పాను. నేడు భారతదేశం 8% వేగంతో అభివృద్ధి చెందుతోంది.’ అన్నారు.

‘వికసిత్ భారత్’ వైపు ప్రయాణం కేవలం సెంటిమెంట్‌కు సంబంధించినది కాదని, విశ్వాసం, చర్యలకు సంబంధించినదని ప్రధాని తెలిపారు. CII పోస్ట్ బడ్జెట్ కాన్ఫరెన్స్‌లో దేశాభివృద్ధిపై ప్రభుత్వ దృష్టిని, లక్ష్యాన్ని సాధించడంలో పరిశ్రమల కీలక పాత్రను మోదీ వివరించారు.



ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 2006 పోస్టులకు నోటిఫికేషన్..

 కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి SSC దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రేడ్-సి, గ్రేడ్-డి స్టెనోగ్రాఫర్ పోస్టులు మొత్తంగా 2006 భర్తీ కానున్నాయి.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస విద్యార్హత బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది. అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా ఇంటర్ అర్హతతో భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి SSC దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రేడ్-సి, గ్రేడ్-డి స్టెనోగ్రాఫర్ పోస్టులు మొత్తంగా 2006 భర్తీ కానున్నాయి. అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌ ssc.gov.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గడువు ఆగస్టు 17న ముగుస్తుంది. ఆగస్టు 27 నుంచి 28 వరకు అప్లికేషన్ ఎడిట్‌కు అవకాశం ఉంటుంది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి పూర్తి వివరాలు పరిశీలిద్దాం.

* వయోపరిమితి

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి వయసు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. అంటే 1994 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య జన్మించిన వారు అర్హులు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి పోస్ట్‌లకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి వయసు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. 1997 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య జన్మించినవారు అప్లై చేసుకోవచ్చు.

* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్

గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ పాసైన అభ్యర్థులు SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

* అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా SSC అధికారిక పోర్టల్ ssc.gov.in ఓపెన్ చేయాలి.

- హోమ్‌పేజీలోకి వెళ్లి ‘స్టెనోగ్రాఫర్ గ్రూప్-సి, గ్రూప్-డి’ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

- తర్వాత ‘లాగిన్’ > ‘రిజిస్టర్ నౌ’ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభించాలి.

- ముందుగా పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి, అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.

- అన్ని వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ నింపాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

- చివరగా అప్లికేషన్ ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.

* అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.

* సెలక్షన్ ప్రాసెస్

అభ్యర్థులకు ముందు ఆన్‌లైన్ రాత పరీక్ష, తర్వాత స్టెనో‌గ్రఫీలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలు అక్టోబర్, నవంబర్‌లో జరుగుతాయి.

* ఎగ్జామ్ ప్యాట్రన్

ఆన్‌లైన్ ఎగ్జామ్ వ్యవధి రెండు గంటలు ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్ ల్వాంగేజ్‌లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ మోడల్‌లో ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సెక్షన్స్ ఉంటాయి. మొదటి రెండు సెక్షన్స్ నుంచి 50 చొప్పున ప్రశ్నలు, చివరి సెక్షన్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ఎగ్జామ్ మొత్తం 200 మార్కులకు జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రెండో దశలో నిర్వహించే స్కిల్ టెస్ట్ షార్ట్ హ్యాండ్ మీద పెన్ అండ్ పేపర్ మోడ్‌లో నిర్వహిస్తారు.

* జీత భత్యాలు

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెల జీతం రూ.9300 నుంచి రూ.34,800 వరకు, గ్రేడ్-డి పోస్టులకు రూ.5200 నుంచి రూ.20200 వరకు ఉంటుంది.



Monday, 29 July 2024

అభ్యర్థులకు శుభవార్త.. ఈ సెంటర్లలో యూపీఎస్సీ ఫ్రీ కోచింగ్‌..

 యూపీఎస్సీ కోచింగ్‌కి లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి ఫీజులు భరించలేని అభ్యర్థుల పరిస్థితి ఏంటి?

దేశంలోనే అత్యున్నతమైన సివిల్స్‌ సర్వీస్‌కు సెలక్ట్‌ అవ్వాలంటే అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాలి. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ ఎగ్జామ్‌ను అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా పేర్కొంటారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయ్యేందుకు చాలామంది విద్యార్థులు ఏళ్ల తరబడి ప్రిపేర్‌ అవుతుంటారు. అంతేకాకుండా యూపీఎస్సీ కోచింగ్‌కి లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి ఫీజులు భరించలేని అభ్యర్థుల పరిస్థితి ఏంటి?

ప్రతి సంవత్సరం, వివిధ ఆర్థిక, విద్యా నేపథ్యాలకు చెందిన చాలా మంది అభ్యర్థులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌ మొదలు పెడుతుంటారు. అయితే స్టడీ మెటీరియల్, ఆన్‌లైన్ పోర్టల్‌లు, యూట్యూబ్ వీడియోలు ఎక్కడి నుంచి ప్రిపరేషన్‌ మొదలు పెట్టాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి వారికి సహాయం చేయడానికి అనేక ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఉచితంగా సివిల్ సర్వీస్ కోచింగ్‌ ఇస్తున్నాయి. ఈ కోచింగ్ ఉచితంగా ఎక్కడ అందిస్తున్నారు, సీట్ల సంఖ్య, అడ్మిషన్ ప్రాసెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* జామియా మిలియా ఇస్లామియా యూపీఎస్సీ కోచింగ్ సెంటర్

భారతదేశంలో మొట్టమొదటి ఉచిత కోచింగ్ సెంటర్ జామియా మిలియా ఇస్లామియా UPSC కోచింగ్ సెంటర్. యూపీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు రెసిడెన్షియల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఈ సంస్థ నుంచి చాలా మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌కి ఎంపికవుతారు.

ఈ సంవత్సరం యూపీఎస్సీ కోచింగ్‌లో ప్రవేశానికి జామియా మిలియా ఇస్లామియాలో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశం పొందిన విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. హాస్టల్ ఫీజు కోసం నెలకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలల అడ్వాన్స్ ఫీజు రూ.6000 తీసుకుంటారు. రెండు నెలల మెయింటెనెన్స్‌ ఫీజును కూడా అడ్వాన్స్‌గా చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు, ఫీజు బాలికల హాస్టల్/ప్రోవోస్ట్ కార్యాలయంలో జమ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి, మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు.

* అడ్మిషన్‌ ఎలా పొందాలి?

జామియా మిలియా ఇస్లామియా కోచింగ్ సెంటర్‌లో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాలి. జూన్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉచిత కోచింగ్‌

భారతదేశంలో రెండో ఉచిత కోచింగ్ సెంటర్‌ ఉత్తర్‌ప్రదేశ్ సోషల్‌ వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్వహిస్తోంది. ఇక్కడ SC, ST, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన, మైనారిటీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులకు మాత్రమే కోచింగ్‌ను అందిస్తారు. ఈ కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్ పొందేందుకు, అభ్యర్థులు socialwelfareup.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్‌ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు పూర్తి యూపీఎస్సీ ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌ శిక్షణ అందుకుంటారు.

సెంటర్ వారీగా అందుబాటులోని సీట్లు:

- ఛత్రపతి షాహూ జీ మహారాజ్ శోధ్ అవమ్ ప్రశిక్షన్ సంస్థాన్ భగీదారి భవన్, లక్నోలో 250 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

- ఆదర్శ్ పూర్వ పరీక్షన్ కేంద్రం అలీగంజ్, లక్నో (మహిళలకు మాత్రమే) 150 సీట్లు ఉన్నాయి.

- IAS/PSC కోచింగ్ సెంటర్, హాపూర్ ఘజియాబాద్‌లో 200 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

- సంత్ రవిదాస్ IAS/PSC కోచింగ్ సెంటర్ వారణాసిలో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

- బీఆర్‌ అంబేద్కర్ కోచింగ్, ఆగ్రాలో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

- ప్రయాగ్‌రాజ్ సెంటర్‌లో 50 సీట్లు ఉన్నాయి.

- గోరఖ్‌పూర్ సెంటర్‌లో 100 సీట్లు ఉన్నాయి.

- బీఆర్‌ అంబేద్కర్ కోచింగ్, అలీఘర్‌లో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.



Railway Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 7951 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజనీర్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. అప్లికేషన్ ప్రాసెస్ జులై 30న ప్రారంభం అవుతుంది.

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వేస్‌ బీఈ, బీటెక్ అర్హతతో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజనీర్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. అప్లికేషన్ ప్రాసెస్ జులై 30న ప్రారంభం అవుతుంది. ఆగస్టు 29 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉన్నవారు తమ పరిధిలోని రైల్వే జోన్ అధికారిక పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్ గురించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం.

* ఖాళీల వివరాలు

జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్‌వైజర్ (రీసెర్చ్), మెటలర్జికల్ సూపర్‌వైజర్ (రీసెర్చ్) వంటి పోస్టుల్లో మొత్తంగా 7951 ఖాళీలు భర్తీ కానున్నాయి.

* వయోపరిమితి

దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 36 ఏళ్లలోపు ఉండాలి.

* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్‌‌ విభాగాల్లో ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

* అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా మీ పరిధి రైల్వే జోన్ ఆధారంగా RRB అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి.

- హోమ్‌పేజీలోకి వెళ్లి ‘JE రిక్రూట్‌మెంట్’ లింక్ క్లిక్ చేసి, నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

- ఆ తరువాత ‘అప్లైనౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ముందు పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

- రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. దీంట్లో అన్ని వివరాలు నింపాలి.

- అప్లికేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.

* అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ. 250 పేమెంట్ చేయాలి.

* సెలక్షన్ ప్రాసెస్

జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఉద్యోగులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. ముందు సీబీటీ-1 ఎగ్జామ్, తర్వాత సీబీటీ-2 ఎగ్జామ్ ఉంటాయి. చివరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థుల ఫైనల్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

* ఎగ్జామ్ ప్యాట్రన్

ఆర్‌ఆర్‌బీ సీబీటీ-1 ఎగ్జామ్ 100 మార్కులకు ఎంసీక్యూ మోడల్‌లో ఉంటుంది. మ్యాథమెటిక్స్ సెక్షన్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్- 25, జనరల్ అవేర్‌నెస్- 15, జనరల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్క్ కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు .

సీబీటీ-2 ఎగ్జామ్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ నుంచి 15 ప్రశ్నలు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ-15, కంప్యూటర్ అప్లికేషన్- 10, ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్- 10, టెక్నికల్ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.

* జీతాల వివరాలు

రైల్వేలో జూనియర్ ఇంజనీర్‌ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ. 35,400 లభిస్తుంది. జీతంతో పాటు అనేక రకాల అలవెన్సులు, సౌకర్యాలు అదనంగా లభిస్తాయి.



Sunday, 28 July 2024

C - DAC లో ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు ఇతర రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

 C - DAC లో ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు ఇతర రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 91 పోస్టులు నింపనున్నారు. ఆన్లైన్ లో అప్లికేషన్ కు చివరి తేదీ ఆగస్టు 16, 2024. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఆన్లైన్ లో అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



SSC నుండి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. లింక్ ఇక్కడే!

 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సుమారు 2006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ లో అప్లికేషన్ కు చివరి తేదీ ఆగష్టు 17, 2024. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి. 

ఆన్లైన్ లో అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



నాబార్డ్ లో ఉద్యోగాలు.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

 నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రురల్ డెవలప్మెంట్ (NABARD) నుండి 102 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ఐనది. ఆన్లైన్ లో అప్లికేషన్ కు చివరి తేదీ ఆగష్టు 15, 2024. మరిన్ని వివరాలు నోటిఫికేషన్ నుండి పొందండి. 

ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి ఎస్‌బీఐ అదిరే గుడ్ న్యూస్..

 ఎస్‌బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఉచితంగానే అదిరే సేవలు అందిస్తోంది. ఉచితంగానే హాస్టల్ వసతి. ఇంకా ఫ్రీగా ట్రైనింగ్. ఆపైన ఈజీగా లోన్స్ అందిస్తోంది. ఈ అవకాశం మిస్ అవ్వొద్దు.

యువతను స్వయం ఉపాధి బాటలో చైతన్యవంతులుగా చేసి వారు స్వయం ఉపాధి ద్వారా జీవితంలో స్థిరపడాలని ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను 2010లోనెలకొల్పారు. దీని ముఖ్య ఉద్దేశ్యం  ఏంటంటే నిరుద్యోగ గ్రామీణ యువత గుర్తించి చైతన్యవంతులు చేయడం వారికి తగిన శిక్షణ, సలహాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడం, స్వశక్తి సంఘాల అభివృద్ధికి తోడ్పడుట, గ్రామీణ ప్రాంత యువత నగరాలకు వలసలు నివారించుట, ఉన్నతమైన చదువులతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న రంగాలలో ఉచితంగా శిక్షణ అందిస్తూ యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తుంది. కరీంనగర్, తిమ్మాపూర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యువతకు ఆయ కోర్సులు ఉచిత శిక్షణ తో పాటు హాస్టల్ వసతి కూడా కల్పిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఇక ఇది విషయంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ  ఇన్చార్జి స్వప్న ను లోకల్ 18 పలకరించే ప్రయత్నం చేసింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు మా సంస్థ లో 9308 మంది అభ్యర్థులు శిక్షణ పొందారు. 7149 మంది వారు తీసుకున్న శిక్షణ రంగంలో స్థిరపడ్డారు. 30395 మంది తమ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు..శిక్షణ సమయంలో ఉచిత వసతులు కల్పిస్తుండగా శిక్షణ తర్వాత సర్టిఫికెట్స్ అందజేసిన బ్యాంకులలో ఋణం తీసుకునే సౌకర్యాన్ని సైతం కల్పిస్తుండడం ఈ సంస్థ ప్రత్యేకత అని ఇన్చార్జ్  స్వప్న లోకల్ 18కి తెలిపారు. ఇందులో అప్లై చేయాలంటే తెలుగులో రాయడం చదవడం రావాలి. కనీసం ఏడవ తరగతి పాస్ఐ ఉండాలి. అభ్యర్థులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావాలి. వయస్సు 18 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి నేర్చుకోవాలని తపన ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులు అని తెలిపారు..  ఇలాంటి సంస్థ ఇస్తున్న శిక్షణ ప్రతి ఒక్క సద్వినియోగం  చేసుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. వేసుకోవాలన్నారు.ఇక్కడ కోర్సులు వచ్చేసి పురుషులకైతే ఏసీ మెకానిక్, మోటో రివైడింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, రిఫ్రిజిరేటర్లు, సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్, ఫోన్ రిపేరింగ్, కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్, డ్రైవింగ్ ఎలక్ట్రిషన్, వంటి కోర్సులు ఉంటాయి. అలాగే లేడీస్, టైలరింగ్, ఫ్యాబ్రిక్  పెయింటింగ్, ఎంబ్రాయిడింగ్, బ్యూటీ పార్లర్, జ్యూట్ బ్యాగ్ తయారీ  లాంటి కోర్సులు నేర్పిస్తున్నారు.కాబట్టి గ్రామీణ ప్రాంత యువతి యువకులు ఇలాంటివీ సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. 



ఇండియన్ రైల్వేస్ లో 7951 ఉద్యోగాలు..

గవర్నమెంట్ అఫ్ ఇండియా, మినిస్ట్రీ అఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 7951 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 30, 2024 నుండి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో చివరి తేదీ ఆగష్టు 29, 2024. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి.


Saturday, 27 July 2024

పరీక్ష లేకుండా నేరుగా జాబ్.. నిరుద్యోగులకు అదిరే గుడ్ న్యూస్, వెంటనే అప్లై చేసుకోండి!

 అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీ లోగా కార్యాలయం పని వేళల్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉపాధ్యాయులకు అలర్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ గా విధులు నిర్వహించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్ డబ్ల్యూర్ఐఎస్ జిల్లా కోఆర్డి నేటర్ డా.ఐ శ్రీదేవి తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం నందు పార్ట్ టైం (తాత్కాలిక) టీచర్‌గా విభిన్న స్థాయిల్లో ( జేఎల్/పీజీటీ/టీజీటీ ) పనిచేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు పార్ట్ టైం టీచర్లుగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో ముఖ్యంగా జేల్ 02 (మ్యాథ్స్ 01, ఫిజిక్స్ 01 ), పీజీటీ 04 ( మ్యాథ్స్ 03, ఇంగ్లిషు 01 ), టీజీటీ 04 ( ఇం గ్లిషు 02, ఫిజికల్ సైన్స్ 02 ) ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా బాలికల పాఠశాలల్లో మహిళలకు బాలుర పాఠశాలలో పురుష అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.ఆసక్తి కలిగిన అభ్యర్థులు పీజీ, బీఎడ్ లో కనీసం ద్వితీయ శ్రేణి ఉత్తీర్ణత, టెట్లో అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు.

అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీ లోగా కార్యాలయం పని వేళల్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు.దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి జిల్లా డిసిఒ కార్యాలయంలో డెమో నిర్వహిస్తామని తెలిపారు.ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం జిల్లా కార్యాలయం లేదా 08518295601 అనే నంబర్ కు ఫోన్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు.

గమనిక :- పైన తెలిపిన వివరాల మేరకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపికైన వారికి మాత్రమే డెమో నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అదే విధంగా అభ్యర్థులు కార్యాలయం పని వేళల్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మిగతా సెలవు దినాల్లో ఎలాంటి దరఖాస్తులు స్వీకరించరు.



Friday, 26 July 2024

18 ఏళ్లు పైబడిన వారికి సూపర్ ఛాన్స్... ఫ్రీ హాస్టల్ తో జాబ్ ఆఫర్.. మిస్ కావద్దు

 జాబ్ కోసం ఎదురుచూపుల్లో ఉన్నారా.. ఫ్రీ హాస్టల్ తో కూడిన జాబ్ ఆఫర్ ఇది. పూర్తి వివరాలు మీ కోసం.. !

టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారా.. ప్రవేట్ జాబ్ కోసం ఎదురుచూపుల్లో ఉన్నారా.. అయితే ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ చేతిలో జాబ్ ఉన్నట్లే.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆయా జిల్లా ఉపాధి కార్యాలయాలలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకున్న ఎందరో నిరుద్యోగులు ఉపాధి పొంది జీవనం సాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒంగోలులోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కార్యాలయం అధికారి భరద్వాజ్ తెలిపారు.

కె. ఎల్ గ్రూప్ ప్రత్యేకంగా అమెజాన్ రిటైల్ రంగంలో ఉద్యోగావకాశానికి సంబంధించి కంపెనీలో ప్యాకింగ్, పికింగ్, స్కానింగ్, లోడింగ్, అన్లోడింగ్ సెక్టార్ లలో వివిధ రకాల ఖాళీలను భర్తీచేయుటకు జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఏదైనా విభాగంలో ఐ.టి.ఐ, డిప్లమో, టెన్త్, ఇంటర్మీడియేట్ ఏదైనా డిగ్రీ చదువులు పూర్తి చేసిన వారు 30వ తేదీన ఇంటర్వ్యూల కోసం జిల్లా ఉపాది కార్యాలయం, ఒంగోలులో హాజరుకావాలని కోరారు.

ఉదయం 10:00 గం.ల నుండి సాయంత్రం 3గం.ల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు, ఇంటర్వ్యూ లో ఎంపిక కాబడిన అభ్యర్ధులకు జీతం నెలకు 16,975/- టేక్ హోమ్, ఉండడానికి నివాసము, రవాణా ఖర్చులు, ప్లస్ పనితీరు ఆధారంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకలు ఇవ్వటం జరుగుతుందని టి. భరద్వాజ్ తెలిపారు.

18సం,, నుండి 35 సం,, మధ్య గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఇంటర్వ్యూ కు ఆధార్ కార్డు, సరిఫికేట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని..మరిన్ని వివరములకు https://forms.qle/wnfddgAQGrLSRwgg9 సైట్ ను సంప్రదించాలని కోరారు.

ఎంపికైన వారు హైదరాబాద్, చెన్నై నగరాలలో పని చేయాల్సి ఉంటుందన్నారు. మరెందుకు ఆలస్యం జాబ్ మేళాలో పాల్గొనండి.. జాబ్ ఛాన్స్ కొట్టేసేయండి మరి.



Thursday, 25 July 2024

వరంగల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లో ప్రొఫసర్, అసిస్టెంట్ ప్రొఫసర్ మరియు అస్సోసియేట్ ప్రొఫసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

 గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (GMC), నర్సంపేట్, వరంగల్ లో ప్రొఫసర్, అసిస్టెంట్ ప్రొఫసర్ మరియు అస్సోసియేట్ ప్రొఫసర్ టెంపరరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూ ద్వారా  తేదీ జులై 25 నుండి జులై 31, 2024 వరకు. మరిన్ని వివరాలకు నోటిఫికేష చదవండి. 



తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. బడ్జెట్‌‌లో జాబ్ క్యాలెండర్‌పై కీలక ప్రకటన చేశారు

 తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్ బడ్జెట్ పద్దును ప్రవేశపెట్టింది. ఈ వేదికగా జాబ్ క్యాలెండర్‌పై కీలక ప్రకటన చేశారు.

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు.

ఈ సమావేశాల్లో తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. విద్యార్థులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ పై కీలక ప్రకటన చేశారు.

ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని, అతి త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన చేస్తామని పేర్కొన్నారు.

ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. తాజాగా బడ్జెట్ సమావేశాల్లో భాగంగా త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.

అయితే ఈ జాబ్ క్యాలెండర్ మొత్తం 50 వేల పోస్టులతో ఉంటుందని తెలుస్తోంది. ఏటా మార్చి 31 లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఇప్పటికే సీఎం రేవంత్ అన్నారు.

ఇకపోతే ఇప్పటికే డీఎస్సీ వేసి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. మరోసారి జనవరి నెలలో డీఎస్సీ వేయడానికి సిద్ధమవుతోంది. మొత్తం 6 వేల పోస్టులతో రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్ ఉండనుందట. ఇప్పటికే దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు.



ఎల్‌ఐసీ‌లో భారీగా ఉద్యోగాలు.. సొంత రాష్ట్రంలో పోస్టింగ్..!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)లో కీలక విభాగం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్..  జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఎల్‌ఐసీ అధికారిక పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)లో కీలక విభాగం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఎల్‌ఐసీ అధికారిక పోర్టల్ www.lichousing.com విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు ఆగస్టు 14న ముగుస్తుంది. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం.

ఖాళీల వివరాలు

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో రాష్ట్రాల వారీగా ఖాళీలను ప్రకటించింది. మొత్తంగా 200 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను సంస్థ భర్తీ చేస్తుంది. అందులో ఏపీ నుంచి 12, తెలంగాణ నుంచి 31 పోస్టులు భర్తీ కానున్నాయి.

వయోపరిమితి

దరఖాస్తుదారుల వయసు కనీసం 21 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లలోపు ఉండాలి.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అందులో కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి.

అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ అధికారిక పోర్టల్ www.lichousing.com ఓపెన్ చేయాలి.

- హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘కెరీర్’ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

- అక్కడ ‘ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ జూనియర్ అసిస్టెంట్-2024’ అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

- ఆ తరువాత ‘అప్లైనౌ’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

- ముందు పర్సనల్ వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.

- అన్ని వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

- అప్లికేషన్ ఫీజు చెల్లించి, చివరగా ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.

అప్లికేషన్ ఫీజు

అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.800+ 18శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్ లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. అదే ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్. రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష సెప్టెంబర్‌లో జరుగుతుంది. రెండు దశలను క్లియర్ చేసినవారికి పోస్టింగ్ లభిస్తుంది.

ఎగ్జామ్ ప్యాట్రన్

ఆన్‌లైన్ ఎగ్జామ్ వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ క్వశన్ మోడల్‌లో ఉంటుంది. పరీక్షలో మొత్తంగా ఐదు సెక్షన్స్ లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ స్కిల్ వంటివి ఉంటాయి. ఒక్కో సెక్షన్ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ఒక తప్పు సమాధానానికి 0.25 మార్క్ కట్ చేస్తారు.

జీతభత్యాలు

ఎల్‌ఐసీ జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ.32,000 నుంచి 35,200 మధ్య లభిస్తుంది. ఇందులో అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కలిసి ఉంటాయి.



Wednesday, 24 July 2024

10th పాసయ్యారా..? రాతపరీక్ష లేకుండా పోస్టాఫీస్ జాబ్స్..

 వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 44,228 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది పోస్టల్ శాఖ.

వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 44,228 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది పోస్టల్ శాఖ. 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాల భర్తీ జరుగనుంది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే ఈ నియామకాలు జరుగుతాయి.

ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ (Dak Sevak) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టులను బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల ప్రారంభ వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసేవారికి కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి. 18-40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తులు ఆన్‌లైన్‌ విధానంలో సమర్పించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఈ పోస్టులకు అప్లై చేసినవారి 10వ తరగతి మార్కుల మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 5, 2024. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్‌ చూడండిఆన్లైన్ లో అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 



ఈ నెల 26న జాబ్ మేళా.. రూ.3 లక్షల వరకు జీతం, ఖాళీగా 200 పోస్టులు, అప్లై చేసుకోండిలా!

 విద్యార్థులందరూ కూడా 10 గంటలకు చేరుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియజేశారు. నిరుద్యోగ యువకులకు అవకాశం ఉన్నంతవరకు అధిక సంఖ్యలో పలు కంపెనీలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమనితెలియజేశారు.

ఉత్తరాంధ్రలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువతకు ఇది గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు స్థానిక నేషనల్ కెరీర్ సెంటరులో నెల 26 న జాబ్ మేళా నిర్వహించనున్నారని ఎంప్లాయిమెంటు అధికారి ఎన్. శ్యామ్సుందర్ ఓ పత్రికా ప్రకటన ద్వార తెలియజేసారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రముఖ కంపెనీలు, సుమారు 200 పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అర్హులైన నిరుద్యో గులు దరఖాస్తు చేసుకోవచ్చని, టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఐటీఐ, డిప్లమో, బి/డి/ఎం ఫార్మ సీ పూర్తి చేసిన వారంతా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అర్హతల ఆధారంగా రూ.10వేల నుంచి రూ.3 లక్షల వేతనం వరకు ఉంటుందని, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, తుని ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారంతా హాజరు కావచ్చని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు స్కిల్ యూనివర్సిటీడాట్ ఏపీ.ఎస్.ఎస్.డి.సి అనే వెబ్సైట్లో , https/employment.ap.gov.in రిజిస్ట్రేష్రన్ చేసుకుని అడ్మిట్ కార్డుతో హాజరు కాగలరని, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదని తెలిపారు.

పైన తెలిపిన విధంగా విద్యార్థులందరూ కూడా 10 గంటలకు చేరుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియజేశారు. నిరుద్యోగ యువకులకు అవకాశం ఉన్నంతవరకు అధిక సంఖ్యలో పలు కంపెనీలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమనితెలియజేశారు. ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులకు మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడమైందన్నారు. విద్యార్థులందరూ కూడా చదువుకొని ఖాళీగా ఉండకుండా మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని కల్పించుకోవాలని తెలియజేశారు. తమ నైపుణ్యాన్ని బట్టి పలు కంపెనీల్లో తీసుకోవడం ఉంటుదన్నారు. ఎప్పటికప్పుడు మెగా జాబ్ మేళా ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు.



Tuesday, 23 July 2024

రైల్వే లో 7951 జూనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టులు..

 గవర్నమెంట్ అఫ్ ఇండియా, మినిస్ట్రీ అఫ్ రైల్వేస్, రైవే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాగాజా 7951 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినది. జులై 30 న నోటిఫికేషన్ విడుదల అగును. ఆన్లైన్ లో అప్లికేషన్ కు చివరి తేదీ ఆగస్టు 29, 2024. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ వచ్చేవరకు వేచి చూడాలి. 



రైల్వే లో 2438 అప్రెంటిస్ ఉద్యోగాలు.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

 రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) , సౌతెర్న్ రైల్వే నుండి 2438 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ ఆగస్టు 12, 2024. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చదవండి. 

ఆన్లైన్ లో అప్లికేషన్  కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



TSPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిలిమినరీ కీ మరియు రెస్పాన్స్ షీట్ విడుదల..

 TSPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిలిమినరీ కీ మరియు రెస్పాన్స్ షీట్ విడుదల చేసారు. కీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. అబ్జెక్షన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు..

 అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

నిరుద్యోగులకు అలర్ట్. కేంద్ర సాయుధ బలగాల్లో చేరి దేశ సేవ చేసే అవకాశం వచ్చింది. దేశంలో శాంతిభద్రతలు పరిరక్షించడంలో కీలకంగా వ్యవహరించే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీఆర్‌పీఎఫ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ నియామకాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ crpf.gov.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు జులై 31 వరకు అవకాశం ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం.

* ఖాళీల వివరాలు

మెడికల్ విభాగంలో జనరల్ డ్యూటీ ఆఫీసర్స్ పోస్టులు 22 భర్తీ కానున్నాయి.

* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. డాక్టర్‌గా సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. ఇంటర్న్‌షిప్ కూడా చేసి ఉండాలి.

* వయోపరిమితి

అభ్యర్థుల గరిష్ట వయసు 70 ఏళ్లలోపు ఉండాలి.

* సెలక్షన్ ప్రాసెస్

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆ తరువాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. సెలక్షన్ కోసం ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.

* ఇంటర్వ్యూ వివరాలు

జులై 31న ఇంటర్వ్యూలు జరుగుతాయి. పూణే, హైదరాబాద్, శ్రీనగర్, ఇంపాల్, గౌహతి, గాంధీనగర్‌లోని సీఆర్‌పీఎఫ్ కాంపోజిట్ హాస్పటల్‌లో ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్ ఒరిజినల్స్(డిగ్రీ, వయసుకు సంబంధించిన సర్టిఫికేట్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్), మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో ఇంటర్వ్యూకు అభ్యర్థులు హాజరుకావాలి.

* జీతభత్యాలు

మెడికల్ విభాగంలో జనరల్ డ్యూటీ ఆఫీసర్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.75,000 లభిస్తుంది. ఎంపికయ్యే అభ్యర్థులు సీఆర్‌పీఎఫ్ ఆసుపత్రుల్లో మూడేళ్ల పాటు సర్వీస్ అందించాల్సి ఉంటుంది. గరిష్ట వయోపరిమితిని దృష్టిలో ఉంచుకుని మరో రెండేళ్ల పాటు సర్వీస్ పొడిగించే అవకాశం ఉంటుంది.

* అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా సీఆర్‌పీఎఫ్ అధికారిక పోర్టల్ crpf.gov.in ఓపెన్ చేయాలి.

- హోమ్‌పేజీలోకి వెళ్లి, సీఆర్‌పీఎఫ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-2024 అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

- ఆ తరువాత ‘అప్లై నౌ’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

- ముందుగా వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

- రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

- అన్ని వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ ఫిలప్ చేయాలి.

- అవసరమైన డాక్యుమెంట్స్‌తో అప్లికేషన్‌ను ఇంటర్వ్యూ సమయంలో సబ్‌మిట్ చేయాలి.

* అప్లికేషన్ ఫీజు

సీఆర్‌పీఎఫ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

*ఉద్యోగ బాధ్యతలు

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫసర్ పోస్ట్‌లకు ఎంపికయ్యే వారు మూడేళ్ల పాటు సీఆర్‌పీఎఫ్ ఆసుపత్రుల్లో సర్వీస్ అందించాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్స్, అధికారులకు చికిత్స అందించాల్సి ఉంటుంది.



ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండిలా..

 అర్హులైన అభ్య ర్థులు అగ్నివీర్ పథకంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మజ తెలిపారు.

ఇంటర్, మూడేళ్లు ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది… ఎయిర్ పోర్స్ లో జాబ్స్ కలవు.. మంచి ఫిట్నెస్, అర్హతలో 50 శాతం మార్కులు ఉంటే చాలు ఈ జాబ్ కి అర్హులు.. కానీ ఒక కండిషన్ పెళ్లి కాని వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. పెళ్లి అయిన వారు ఈ జాబ్ కు అర్హులు కారు. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ కొంచెం తెలివి ప్రదర్శిస్తే చాలు నీడలో కూర్చొని జాబ్చేసుకోవచ్చు. మంచి పరపతి గల జాబ్ సమాజంలో మంచి పేరు ఉంటుంది మనకి.ఒకసారి ట్రై చేయండి జాబ్ కొట్టండి.

చిత్తూరుజిల్లాలో అర్హులైన అభ్య ర్థులు అగ్నివీర్ పథకంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మజ తెలిపారు.ఆమె విలేకరులతో మాట్లాడుతూ 21 ఏళ్లలోపు ఉండి 50 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జె క్టులతో ఇంటర్, మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొ మాతో సమానమైన విద్యార్హతలు కలిగి ఉండాలన్నారు.

వివాహం కాని పురుష, మహిళా అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో రాతపరీక్ష ఫిజికల్, మెడికల్ ఫిట్నెస్ పరీక్షలతో పాటు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. వివరాలజు www.afnipathvayucdac.in వెబ్ సైట్ లోపరిశీలించాలని సూచించారు.



ఇండియన్ నేవీలో లక్షల జీతంతో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

 ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం పొందాలనుకునే యువతకు ఇదో పెద్ద శుభవార్త.ఈ ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 741 పోస్టులను భర్తీ చేయనుంది. ఈపోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.కాబట్టి మీ అర్హతలను బట్టి ఇండియన్ నేవీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం పొందాలనుకునే యువతకు ఇదో పెద్ద శుభవార్త.ఈ ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 741 పోస్టులను భర్తీ చేయనుంది. ఈపోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.కాబట్టి మీ అర్హతలను బట్టి ఇండియన్ నేవీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లై చేసుకునే పోస్టులు ఇవే..

ఇండియన్ నేవీలో జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ B (NG), జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ C, ఫైర్‌మ్యాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, ట్రేడ్స్‌మెన్ మేట్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం నేవీ రిక్రూట్‌మెంట్ విడుదల చేయబడింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.

741 పోస్టులు భర్తీ..

ఈ ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 741 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులపై పనిచేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు కింది సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి.

రిక్రూట్‌మెంట్ జరిగే పోస్టులు ..

జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ‘బి (NG) - 33 పోస్టులు

జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’ - 2 పోస్టులు

ఫైర్‌మెన్ - 444 పోస్టులు

ఫైర్ ఇంజన్ డ్రైవర్ - 58 పోస్టులు

ట్రేడ్స్‌మెన్ మేట్ - 161 పోస్టులు

పెస్ట్ కంట్రోల్ వర్కర్ - 18 పోస్టులు

కుక్ - 9 పోస్టులు

మల్టీ టాస్కింగ్ సిబ్బంది - 16 పోస్టులు

మొత్తం - 741 పోస్ట్‌లు

ఇండియన్ నేవీలో జాబ్ కోసం ఏజ్ లిమిట్..

చార్జ్‌మెన్ (అమ్యూనిషన్ వర్క్‌షాప్), చార్జ్‌మెన్ (ఫ్యాక్టరీ) - 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు

చార్జ్‌మెన్ (మెకానిక్), సైంటిఫిక్ అసిస్టెంట్ - 30 సంవత్సరాల

డ్రాఫ్ట్స్‌మన్ (కన్‌స్ట్రక్షన్) - 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల

ఫైర్‌మెన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్ - 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల

ట్రేడ్స్‌మన్ మేట్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు

ఎంపిక చేసే విధానం ఇదే..

ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఇండియన్ నేవీ భర్తీ చేయబోయే పోస్టులకు అభ్యర్థులు ఎంపిక చేయబడతారు.

అప్లికేషన్ ఫామ్ ఛార్జ్..

ఈ ఇండియన్ నేవీ పోస్టులకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు. వారు నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ కార్డ్, రూపే క్రెడిట్, డెబిట్ కార్డ్ లేదా UPI ద్వారా పరీక్ష రుసుము 295 చెల్లించాలి. మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వికలాంగులు లేదా మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు ఈ రుసుము నుండి మినహాయింపు ఉంది.

జీతం అలవెన్స్ వివరాలు..?

జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ‘బి’ (NG) – రూ. 35400 నుండి రూ. 112400

జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’ - రూ. 25500 నుండి రూ. 81100

ఫైర్‌మెన్- రూ. 19900 నుండి రూ. 63200

ఫైర్ ఇంజన్ డ్రైవర్ - రూ. 21700 నుండి రూ. 69100

ట్రేడ్స్‌మన్ మేట్ – రూ. 18000 నుండి రూ. 56900

పెస్ట్ కంట్రోల్ వర్కర్ – రూ. 18000 నుండి రూ. 56900

కుక్ - రూ. 19900 నుండి రూ. 63200

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - రూ. 18000 నుండి రూ. 56900



Monday, 22 July 2024

క్రేజీ జాబ్‌ నోటిఫికేషన్‌.. నెలకు జీతం ఒక లక్ష 80 వేలు

  ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నారా? ఎక్కువ శాలరీ అందించే ఆప్షన్‌ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ వార్త.

ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నారా? ఎక్కువ శాలరీ అందించే ఆప్షన్‌ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ వార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (Steel Authority of India Limited)లో భారీ జీతంతో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 249 మేనేజ్మెంట్ ట్రైనీ (Management Trainee) పోస్టుల భర్తీ కోసం సెయిల్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చింది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 25 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు, యూనిట్లు, గనుల్లో పని చేయాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా చూస్తే.. కెమికల్ ఇంజినీరింగ్ - 10 పోస్టులు, సివిల్ ఇంజినీరింగ్ - 21 పోస్టులు, కంప్యూటర్ ఇంజినీరింగ్ - 9 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 61 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ - 5 పోస్టులు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ - 11 పోస్టులు, మెకానికల్ ఇంజినీరింగ్ - 69 పోస్టులు, మెటలర్జీ ఇంజినీరింగ్ - 63 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు గేట్-2024 స్కోర్ తప్పనిసరి.

వయోపరిమితి 28 ఏళ్లు మించి ఉండకూడదని నోటిఫికేషన్ లో తెలిపారు. ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు జీతం ఉంటుంది. మరిన్ని వివరాలకు సెయిల్ అధికారిక వెబ్సైట్ https://www.sail.co.in/ విజిట్ చేయండి.



TGSRTC బంపర్ బొనాంజా..! ఇక రాబోయే రోజులు పండగే..

TGSRTC Jobs: టీజీఎస్‌ఆర్టీసీకి సంబంధించిన ఓ కీలక విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిరుద్యోగులు ఆనందపడే ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC)లో కొలువుల జాతర షురూ కాబోతోంది. రీసెంట్ గా మహాలక్ష్మి స్కీం తీసుకొచ్చి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే TGSRTCలో 3035 ఉద్యోగాల భర్తీకి స్వీకారం చుట్టారు. ఈ ఖాళీల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో విషయం బయటకొచ్చింది.

టీజీఎస్‌ఆర్టీసీలో వచ్చే ఐదేళ్లలో భారీగా ఉద్యోగాల కల్పన ఉండనుందని తెలుస్తోంది. డిపార్ట్‌మెంట్‌లో ఏకంగా 10 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని సమాచారం. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచడంతో 2020, 2021 సంవత్సరాల్లో చాలా వరకు రిటైర్మెంట్స్ ఆగిపోయాయి. వీరంతా కూడా 2022 నుంచి రిటైర్మెంట్లు షురూ కానున్నాయి. ఈ ఏడాది 2196, 2025లో 1859, 2026లో 2001, 2027లో 1900 మంది రిటైర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే 10 వేల మందికి పైగా రిటైర్మెంట్లు కానున్నాయి. దీంతో ఈ వెకెన్సీస్ భర్తీపై RTC ఫోకస్ పెట్టాల్సి వస్తుంది.

ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తున్నారు. అయితే కారుణ్య నియామకాలు మినహా గత పదేళ్లుగా సంస్థలో కొత్త నియామకాలు జరగలేదని, సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో ఇప్పుడు భారీ ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని గతంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకు మార్గం సుగమమం చేస్తూ TGSRTC లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు 10 వేల పోస్టులపై సమాచారం రావడంతో నిరుద్యోగులు ఖుషీ ఖుషీ అవుతున్నారు.



అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త స్కీమ్, ఒక్కొక్కరికి రూ.లక్ష, అర్హతలు ఇవే!

 ప్రభుత్వం తీపికబురు అందించింది. మరో కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. దీని ద్వారా ఒక్కొక్కరికి రూ.లక్ష లభించనున్నాయి. అర్హతలు తెలుసుకోండి.

అదిరిపోయే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మరో కొత్త స్కీమ్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వం తాజాగా కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయం లభించనుంది.

అసలు ఇంతకీ అది ఏ స్కీమ్? ఎవరి కోసం తెచ్చారు? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమంత్రి తాజాగా ఈ కొత్త స్కీమ్‌ను ప్రకటించారు.

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు ఆర్థిక సాయం అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ పథకం కేవలం తెలంగాణలో మాత్రమే అమలులో ఉంటుంది. ఇక్కడి వారికే వర్తిస్తుంది.

సెక్రటేరియట్‌లో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు సర్కారు ఆర్థిక సాయం అందించనుంది.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్. దీని వల్ల పేద విద్యార్థలుకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందొచ్చు.

కాగా ఇప్పటికే గ్రూప్స్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రూప్ 1 పరీక్షలను రాసే అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. మెయిన్స్ పరీక్షలను రాసే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది.

అలాగే ఉచిత కోచింగ్‌తో పాటు ప్రతి నెలా 5,000 రూపాయల చొప్పున మొత్తాన్ని స్టైపెండ్‌గా అందించనుంది. హైదరాబాద్‌లో సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8, ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్‌లల్లో ఈ ఉచిత కోచింగ్ కొనసాగుతుంది.

ఈ శిక్షణ 75 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ స్టడీ కాలంలో అభ్యర్థులకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. పేద విద్యార్థులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పుడు ప్రిలిమ్స్ అభ్యర్థుల కోసం కొత్తగా ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల గ్రూప్స్ అభ్యర్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.



Sunday, 21 July 2024

SBI లో స్పెషలిస్ట్ కేడర్​ ఆఫీసర్ పోస్టులు..పూర్తి వివరాలు మీకోసం

 బ్యాంక్ ఉద్యోగాల కోసం సిద్దమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.

SBI Specialist Officer Recruitment 2024: బ్యాంక్ ఉద్యోగాల కోసం సిద్దమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. 1040 స్పెషలిస్ట్ కేడర్​ ఆఫీసర్​ (SCO) పోస్టుల భర్తీ కోసం ఎస్బీఐ(SBI) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లయ్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 8,2024. ఈ పోస్టులకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ లలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసే ముందు పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, జీతం తదితర వివరాలను తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూడండి.

పోస్టుల వివరాలు

వీపీ వెల్త్​ - 643 పోస్టులు

రిలేషన్​షిప్ మేనేజర్ - 273 పోస్టులు

ఇన్వెస్ట్​మెంట్ ఆఫీసర్ - 49 పోస్టులు

రిలేషన్​షిప్ మేనేజర్​ (టీమ్​ లీడ్​) - 32 పోస్టులు

ఇన్వెస్ట్​మెంట్ స్పెషలిస్ట్ - 30 పోస్టులు

రీజినల్​ హెడ్​ - 6 పోస్టులు

సెంట్రల్​ రీసెర్చ్ టీమ్​ (ప్రోడక్ట్ లీడ్​) - 2 పోస్టులు

సెంట్రల్​ రీసెర్చ్​ టీమ్​ (సపోర్ట్​) - 2 పోస్టులు

ప్రాజెక్ట్ డెవలప్​మెంట్​ మేనేజర్ (బిజినెస్​) - 2 పోస్టులు

ప్రాజెక్ట్ డెవలప్​మెంట్​ మేనేజర్ (టెక్నాలజీ) - 1 పోస్టు

మొత్తం పోస్టులు - 1,040

విద్యార్హత

ఒక్కో పోస్టుకి విద్యార్హత వేరుగా ఉంది. కావును దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి.

వయోపరిమితి

సెంట్రల్​ రీసెర్చ్ టీమ్​ (ప్రొడక్ట్ లీడ్​) : అభ్యర్థుల వయస్సు 30-45 ఏళ్ల మధ్యలో ఉండాలి.

రిలేషన్​షిప్ మేనేజర్ : 23-35 ఏళ్ల మధ్యలో ఉండాలి.

రీజినల్​ హెడ్​ : 35-50 ఏళ్ల మధ్యలో ఉండాలి.

అప్లికేషన్ ఫీజు

జనరల్​, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 చెల్లించాలి.

OBC, దివ్యాంగులు, ST, SC అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించక్కర్లేదు

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల క్వాలిఫికేషన్స్,అనుభవం ఆధారంగా వారిని షార్ట్ లిస్ట్​ చేస్తారు. తర్వాత వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ముందుగా https://sbi.co.in/web/careers వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.

SBI SCO Apply Online లింక్​పై క్లిక్ చేయాలి.

అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.

మీ ఫొటో, సిగ్నేచర్​ సహా అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్​లోడ్ చేయాలి.

అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.

తర్వాత అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.

భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.



Revanth Reddy: నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి మరో ప్రభుత్వ నోటిఫికేషన్ రిలీజ్

 నిరుద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత, జౌళి శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

నిరుద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే DSC నోటికేషన్ రిలీజ్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. చేనేత, జౌళి శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది రేవంత్ సర్కార్. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 30 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. ఈ మేరకు చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్‌ ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మొత్తం 30 పోస్టుల్లో.. 8 క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ పోస్టులు ఉండగా.. 22 టెక్స్‌టైల్‌ డిజైనర్‌ పోస్టులు ఉన్నాయి. IIHT నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొన్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవాలని, ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు కనీసం మూడేళ్లు విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు https://tsht.telangana.gov.in/HNDM/Views/Home.aspx సందర్శించండి.
కాగా.. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రూప్ I, II, III, ప్యారా మెడికల్, పోలీస్, డీఎస్సీ, టెట్.. ఇలా ఏ పరీక్షలైనా సరైన సమయంలో సమర్థవంతంగా నిర్వహించాలన్నదే ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం అంటున్నారు. కష్టపడే విద్యార్థులకు ఈ ప్రభుత్వం భుజం తడుతుందని భరోసానిచ్చారు సీఎం.


Job Alerts and Study Materials