Mother Tongue

Read it Mother Tongue

Monday, 22 July 2024

అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త స్కీమ్, ఒక్కొక్కరికి రూ.లక్ష, అర్హతలు ఇవే!

 ప్రభుత్వం తీపికబురు అందించింది. మరో కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. దీని ద్వారా ఒక్కొక్కరికి రూ.లక్ష లభించనున్నాయి. అర్హతలు తెలుసుకోండి.

అదిరిపోయే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మరో కొత్త స్కీమ్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వం తాజాగా కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయం లభించనుంది.

అసలు ఇంతకీ అది ఏ స్కీమ్? ఎవరి కోసం తెచ్చారు? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమంత్రి తాజాగా ఈ కొత్త స్కీమ్‌ను ప్రకటించారు.

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు ఆర్థిక సాయం అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ పథకం కేవలం తెలంగాణలో మాత్రమే అమలులో ఉంటుంది. ఇక్కడి వారికే వర్తిస్తుంది.

సెక్రటేరియట్‌లో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు సర్కారు ఆర్థిక సాయం అందించనుంది.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్. దీని వల్ల పేద విద్యార్థలుకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందొచ్చు.

కాగా ఇప్పటికే గ్రూప్స్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రూప్ 1 పరీక్షలను రాసే అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. మెయిన్స్ పరీక్షలను రాసే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది.

అలాగే ఉచిత కోచింగ్‌తో పాటు ప్రతి నెలా 5,000 రూపాయల చొప్పున మొత్తాన్ని స్టైపెండ్‌గా అందించనుంది. హైదరాబాద్‌లో సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8, ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్‌లల్లో ఈ ఉచిత కోచింగ్ కొనసాగుతుంది.

ఈ శిక్షణ 75 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ స్టడీ కాలంలో అభ్యర్థులకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. పేద విద్యార్థులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పుడు ప్రిలిమ్స్ అభ్యర్థుల కోసం కొత్తగా ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల గ్రూప్స్ అభ్యర్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials