Mother Tongue

Read it Mother Tongue

Sunday, 21 July 2024

Revanth Reddy: నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి మరో ప్రభుత్వ నోటిఫికేషన్ రిలీజ్

 నిరుద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత, జౌళి శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

నిరుద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే DSC నోటికేషన్ రిలీజ్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. చేనేత, జౌళి శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది రేవంత్ సర్కార్. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 30 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. ఈ మేరకు చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్‌ ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మొత్తం 30 పోస్టుల్లో.. 8 క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ పోస్టులు ఉండగా.. 22 టెక్స్‌టైల్‌ డిజైనర్‌ పోస్టులు ఉన్నాయి. IIHT నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొన్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవాలని, ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు కనీసం మూడేళ్లు విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు https://tsht.telangana.gov.in/HNDM/Views/Home.aspx సందర్శించండి.
కాగా.. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రూప్ I, II, III, ప్యారా మెడికల్, పోలీస్, డీఎస్సీ, టెట్.. ఇలా ఏ పరీక్షలైనా సరైన సమయంలో సమర్థవంతంగా నిర్వహించాలన్నదే ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం అంటున్నారు. కష్టపడే విద్యార్థులకు ఈ ప్రభుత్వం భుజం తడుతుందని భరోసానిచ్చారు సీఎం.


1 comment:

  1. Part time teacher గురించి కూడా alochinchandi sir సంవత్సరాల నుండి chese valla బతుకులు అగమ్యగోచరంగా మారింది sir

    ReplyDelete

Job Alerts and Study Materials