Mother Tongue

Read it Mother Tongue

Saturday, 14 January 2023

TSPSC TPBO Exam Date 2023 : TSPSC కీలక ప్రకటన.. TPBO రాత పరీక్ష తేదీ ఖరారు.. పూర్తి వివరాలివే

TSPSC TPBO Recruitment 2023 : మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష తేదీని TSPSC వెల్లడించింది. వివరల్లోకెళ్తే...

TSPSC TPBO Exam Date 2023 : తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష తేదీని TSPSC వెల్లడించింది. పట్టణ ప్రణాళిక విభాగంలో 175 టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ (TPBO) పోస్టుల భర్తీకి మార్చి 12న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు TSPSC కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు పరీక్ష తేదీకి వారం రోజుల ముందు కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

TSPSC TPBO Exam పరీక్ష విధానం:

TSPSC TPBO Exam మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రెండు విభాగాల నుంచి 300 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, అభ్యర్థి సంబంధిత సబ్జెక్ట్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయిస్తారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials