Mother Tongue

Read it Mother Tongue

Friday, 17 February 2023

అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల.. ఎత్తు 162 సెం.మీ.. వయస్సు 17ఏళ్లు.. పది అర్హత..


 ఇండియన్ ఆర్మీలో (Indian Army) చేరాలనుకుంటున్న యువతకు గుడ్ న్యూస్. అగ్నివీరుల (Agniveer) నియామకానికి ప్రకటన విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 జిల్లాల్లోని అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు అధికారులు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచి అంటే ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు https://www.joinindianarmy.nic.in/ వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 17 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని దశల్లో అర్హతలు సాధించిన వారిని నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు. ఏఆర్వో విశాఖపట్నం పరిధిలో ఈ అగ్నివీర్ నియామకాలు 2023-24 సంవత్సరానికి జరగనున్నాయి. ఆ 14 జిల్లాల జాబితా విషయానికి వస్తే.. విశాఖ పట్నం, శ్రీకాకులం , విజయనగరం , ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, పార్వతీ పురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, అనకాపల్లి, ఏలూరు , ఎన్టీఆర్ , కాకినాడ , యానాం జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 

అర్హతల వివరాలు..

1) అగ్నివీర్ జనరల్ డ్యూటీ

అర్హత: అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ సైతం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 17.5 నుంచి 21 ఏళ్లు ఉండాలి.

2) అగ్నివీర్ టెక్నికల్

అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా అందుకు సమానమైన విద్యార్హత పొంది ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి. టెన్త్ తో పాటు రెండేళ్ల ఐటీఐ/ మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 17.5 - 21 ఏళ్ల మధ్య ఉండాలి.

3) అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ (టెక్నికల్)

అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. ఇంకా.. ఒక్కో సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 17.5 నుంచి 21 ఏళ్లు ఉండాలి.

4) అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్

అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 17.5 - 21 ఏళ్ల మధ్య ఉండాలి.

5) అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (8Th Pass)

అభ్యర్థులు 8వ తరగతి పాసై ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించి ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుదారుల వయస్సు 17.5 - 21 ఏళ్ల మధ్య ఉండాలి.

శారీరక ప్రమాణాలు ఇలా..

అభ్యర్థుల యొక్క ఎత్తు అగ్నివీర్ జీడీ పోస్టులకు 166 సెం.మీ, అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు 165 సెం.మీ, అగ్నివీర్ క్లర్క్ పోస్టులకు 162 సెం.మీ ఉండాలన్నారు. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials