తెలంగాణలో 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల 5,204 స్టాఫ్
నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ
ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 25, 2023వ తేదీ ఉదయం 10.30
గంటలకు ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 15ను ఆఖరి తేదీగా
నిర్ణయించింది మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్. అర్హత,
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను
https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి
ఉంటుంది. మొత్తం 5,204 ఖాళీల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/డైరెక్టర్ ఆఫ్
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 3,823 పోస్టులు, తెలంగాణ వైద్యవిధాన
పరిషత్ లో మరో 757 పోస్టులు ఉన్నాయి. ఇంకా.. ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్
సెంటర్ 81 పోస్టులు, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్
ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ 127 పోస్టులు ఉన్నాయి. మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్
ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో 197 పోస్టులు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్
రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ 74 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్
సొసైటీలో 124 పోస్టులు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్
ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో 13 పోస్టులు ఉన్నాయి.
No comments:
Post a Comment