Mother Tongue

Read it Mother Tongue

Saturday, 18 February 2023

రేపే ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష.. నిమిషం దాటినా నో ఎంట్రీ.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..

 

ఏపీలో 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన నియామక పరీక్ష (AP SI Prelims Exam) ఫిబ్రవరి 19న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. వీరిలో 1,71,936 మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నట్లు వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా అభ్యర్థులకు సూచనలతో కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అభ్యర్థులు పాటించాల్సిన నియమాలివే:

 - అభ్యర్థులు ఒకరోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి.

- అభ్యర్థులను మొదటి పేపర్ కు ఉదయం 09.00 గంటల నుంచి మరియు రెండవ పేపర్ కు మధ్యాహ్నం 01.30 గంటల నుండి పరీక్ష హాలులోకి అనుమతిస్తారు.

- అభ్యర్థులు మొదటి పేపర్ కు ఉదయం 10.00 గంటల తర్వాత మరియు రెండవ పేపర్ కు మధ్యాహ్నం 02.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.

 - మొబైల్/సెల్యులార్ ఫోన్, టాబ్లెట్/ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, వాలెట్, పర్సు, నోట్స్, చార్ట్ లు ఏ రకమైన పేపర్లు లేదా రికార్డింగ్ పరికరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రం లోనికి అనుమతించరు. వాటిని కేంద్రాల వద్దకు తీసుకొని రావొద్ద. వాటిని భద్ర పరుచుకోవడానికి ఎటువంటి అదనపు ఏర్పాట్లు ఉండవు.

-అభ్యర్థులు గుర్తింపుగా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్ వంటి ఏదైనా ఇతర ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును తీసుకురావాలి.

-పరీక్ష రాయడానికి అభ్యర్థులు తమ హాల్ టికెట్ మరియు బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకొనవలెను.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials