నిరుద్యోగులకు శుభవార్త.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కింది ఖాళీలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5280 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 22, 2023 మరియు చివరి తేదీ డిసెంబర్ 12, 2023 గా ఉన్నది. ఎక్సమ్ మాత్రం జనవరి 2024 లో ఉండవచ్చు. కనిష్ట మరియు గరిష్ట వయో పరిమితులు వరుసగా 21 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. నిబంధనలకు అనుగుణంగా వయో పరిమితులు కూడా వున్నాయి. ఎస్.సి., ఎస్.టి., దివ్యంగులకు ఎలాంటి ఫీజు లేదు. మిగిలిన వారికీ 750/- రూపాయలు చెల్లించాలి. ఏదైనా డిగ్రీ ని విద్య అర్హత కలిగి ఉండాలి. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ చదవండి.
ఉద్యోగ ఖాళీలు 5280
- ఆంధ్రప్రదేశ్. 400
- తెలంగాణ 425
- మిగిలినవి ఇతర రాష్ట్రాలలో ఉన్నవి
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ & ఫీజు చెల్లింపు: 22-11-2023
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ & ఫీజు చెల్లింపు: 12-12-2023
- ఆన్‌లైన్ టెస్ట్ కోసం కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేయడానికి తేదీ: జనవరి 2024
- (తాత్కాలికంగా) ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జనవరి 2024 (తాత్కాలికంగా)
దరఖాస్తు రుసుము
- జనరల్/ OBC/ EWS కోసం: రూ. 750/-
- SC/ST/PWD/: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్
విద్యార్హత
- అభ్యర్థులు ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి.
- మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ చూడండి
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది
No comments:
Post a Comment