ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జిల్లాల వారీగా ఖాళీల వివరాలు బయటకొచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన టీడీపీ ప్రభుత్వం ప్రజలకు
వరుసపెట్టి శుభవార్తలు చెబుతోంది. ప్రజా సంక్షేమం, స్టూడెంట్స్ భవితవ్యంపై
ప్రధానంగా దృష్టి సారించిన చంద్రబాబు సర్కార్.. వచ్చి రావడంతోనే మెగా
డీఎస్సీ అనౌన్స్ చేసింది.
సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే చంద్రబాబు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసిన సంగతి
తెలిసిందే. ఇందులో ప్రధానమైన అంశంగా మెగా డీఎస్సీని తీసుకున్నారు. నిన్న
(సోమవారం) జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీకి మంత్రి వర్గం
ఆమోదం తెలిపింది.
మెగా డీఎస్సీలో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా
షెడ్యూల్ రెడీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జులై
ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ షురూ చేసి డిసెంబర్ 10లోగా పరీక్షలు పూర్తి
చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.
అయితే 16,347 డీఎస్సీ పోస్టులకు జులై 1న పూర్తి షెడ్యూల్ విడుదల
చేయనున్నామని ప్రభుత్వం తెలిపింది. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్
స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయఐ తెలిసింది.
శ్రీకాకుళంలో 543, విజయనగరంలో 583, విశాఖలో 1134, తూర్పు గోదావరిలో 1346,
పశ్చిమ గోదావరిలో 1067, కృష్ణాలో 1213, గుంటూరులో 1159, ప్రకాశంలో 672,
నెల్లూరులో 673, చిత్తూరులో 1478, కడపలో 709, అనంతపురంలో 811, కర్నూలులో
2678 ఖాళీలు ఉన్నాయి.
ముందుగా TET పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత మెగా డీఎస్సీకి నోటిఫికేషన్
ఇవ్వబోతున్నారట. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో
వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ
ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.
No comments:
Post a Comment