Mother Tongue

Read it Mother Tongue

Friday, 14 March 2025

టెన్త్ పాసైతే చాలు.. రూ.69,000 జీతంతో ఉద్యోగం ! ఈ ఛాన్స్‌ను అస్సలు మిస్ చేసుకోకండి

 ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) శుభవార్త చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్-సి పోస్టుల భర్తీకి ఐటీబీపీ ద‌ర‌ఖాస్తులను స్వీక‌రిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 133 పోస్టులను నింపనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు కలిగి ఉండాలి. SC/ST/OBC, ఇతర వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచిన అభ్యర్థులు అర్హులు.

రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో స్పోర్ట్స్ ట్రయల్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జీతం రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య ఉంటుంది. ఈ ఉద్యోగాల‌కు అప్లై చేసుకోవ‌డానికి ఏప్రిల్ 2వ తేదీ వరకు అవ‌కాశం ఉంది.

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) 133 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత: పదో తరగతి, వయసు 18-23. దరఖాస్తు చివరి తేదీ: 02.04.2025.

అప్లై చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌ను (https://recruitment.itbpolice.nic.in) సందర్శించండి.

స్పోర్ట్స్‌ విభాగాలు: వెయిట్‌లిఫ్టింగ్‌ (Weight Lifting), టైక్వాండో (Taikwando), సైక్లింగ్‌ (Cycling), యోగాసన (Yoga), పెన్కాక్‌ సిలాట్‌ (Pencak Sellat), బాస్కెట్‌బాల్‌ (Basket Ball), ఆర్చరి (Archery), ఫుడ్‌బాల్‌ (FootBall), గుర్రపు స్వారీ (Horse Riding), కాయాకింగ్‌ (Kiaking), అథ్లెటిక్‌ (Athletics), స్విమ్మింగ్‌ (Swimming), షూటింగ్‌ (Shooting), బాక్సింగ్‌ (Boxing), రోయింగ్‌ (Rowing), వాలీబాల్‌ (WolleyBall), జూడో (Judo), రెజ్లింగ్‌ (Wrestling), జిమ్నాస్టిక్స్‌ (Gymnastics), కబడ్డి (Kabaddi), ఐస్‌ హాకీ (Ice Hockey), హాకీ (Hockey), హ్యాండ్‌బాల్‌ (HandBall), ఐస్‌ స్కీయింగ్‌ (Ice Skweeing), పవర్‌ లిఫ్టింగ్‌ (Power Lifting), ఖోఖో (Khokho) ఉన్నాయి.

పోస్టులు - 133 (పురుషులు- 70,మహిళలు- 63)

దరఖాస్తు ప్రారంభం: 04.03.2025.

దరఖాస్తుకు చివరి తేదీ: 02.04.2025.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials