ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో మేళా నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా విశాఖలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది. విశాఖ జిల్లాలో SVLN జిల్లా పరిషత్ హై స్కూల్ గోపాలపట్నంలో ఏప్రిల్ 24వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్ రీజినల్ ఎంప్లాయిమెంట్ అధికారి ఎన్.శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 50కి పైగా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు.
టెన్త్, ఇంటర్, డిగ్రీ, MBA, MCA ఉత్తీర్ణత సాధించి 18-35 ఏళ్ల వయసు గల
అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. 18-35 సం. మధ్య వయసు ఉండాలని తెలిపారు.
విద్యార్హత పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఆపై చదువు
పూర్తిచేసి ఉండాలి అని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూకు
బయోడేటా, పాన్ కార్డు, ఆధార్ కార్డు, సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు
కావాలని తెలిపారు.
No comments:
Post a Comment