ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న స్పెషల్ DSC పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహమైంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది.
ఇందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 240 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ 240 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులలో 110 ఎసీటీ, 69 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 199 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా గతంలోనే 69 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా మరో 130 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను DSC ద్వారా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తుంది.
రాష్ట్రంలో 16,347 ప్రభుత్వ టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం DSC ఫైల్ పైనే చేశారు. అయితే రాష్ట్రంలో SC వర్గీకరణ చేపట్టిన తరువాత వీటి ప్రక్రియ పూర్తి చేసేందుకు కాస్త ఆలస్యం అవ్వగా మరో 5 రోజులోన్నే మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. SC కమిషన్ రిపోర్టర్ నివేదికకు ఏపీ కాబినెట్ నిన్నటి రోజున ఆమోదం తెలపడంతో 2 రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి ఆ తరువాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.
వచ్చే గురువారం లోపు రాష్ట్రంలో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుంది. మెగా DSC ద్వారా కర్నూలు జిల్లాలో 2,600 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో SGT పోస్టులు 1000, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1600 ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
No comments:
Post a Comment