తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే స్థాపించిన ఒక సంస్థ. దీనిలో ప్రభుత్వ అకాడమీలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంచి యువతకు నైపుణ్యాలను అభివృద్ధి చేసే ఉద్యోగాలను మెరుగుపరచడమే ఈ సంస్థ లక్ష్యం. సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధి ప్రోగ్రామ్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీ స్కిల్లింగ్స్ ప్రోగ్రామ్స్, ఉద్యోగాలు , ఇంటర్న్‌షిప్‌లు టాస్క్ అందించే ముఖ్యమైన కార్యక్రమాలు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ టాస్క్ సంస్థ పలుచోట్ల ఉద్యోగ మేళాలను నిర్వహిస్తుంది. వేలాది మంది నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొని ఉద్యోగాలను పొందుతున్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో టాస్క్ సంస్థ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈనెల 27న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈనెల 27న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే జాబ్ మేళాలో మెడ్ ప్లస్, అపోలో ఫార్మసీ, హెచ్డిబి, టాటా స్ట్రైక్, జిఎంఆర్, ఐడిబిఐ, జఫ్తో, జస్ట్ డయల్, వెస్టీజ్, యూత్ ఫర్ జాబ్స్, ఫాక్స్ కన్, యాక్సిస్ బ్యాంక్, రాపిడో, కేబికే గ్రూప్ ఇలా 50కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. సుమారుగా 10,000 మంది నిరుద్యోగ అభ్యర్థులను ఇందులో ఎంపిక చేయనున్నారు.
ఇందుకు పదవ తరగతి, ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్, బి ఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంటెక్ ఇలా పలు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఇందుకు అర్హులు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఇందుకు అర్హులు. అభ్యర్థులను ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగ మేళా ఈ నెల 27న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ కాన్వెన్షన్ హాల్ లో నిర్వహించనున్నారు. 27న ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ జాబ్ మేళాలో అభ్యర్థులు తమ విద్యా అర్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు, బయోడేటా, ఆధార్ కార్డ్, పాస్ ఫోటో తీసుకొని హాజరు కావాలి. జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Vemulawada
ReplyDeleteRajanna sircilla Districk vemulawada gramam Telangana state
ReplyDeleteVemulawada
ReplyDeleteVemulawada
ReplyDelete