Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 14 February 2023

టీఎస్పీఎస్సీ అలర్ట్.. 1392 పోస్టులకు ప్రారంభమైన సవరణ ప్రక్రియ..


 టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(JL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification)  ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జేఎల్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వెలువడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో నోటిఫికేషన్‌ జారీ చేశారు. తర్వత అనేక కారణాల వల్ల ఈ పోస్టులను 2012లో భర్తీ చేశారు. తెలంగాణ ప్రాంతంలో సుమారు 457 జేఎల్‌ పోస్టులను భర్తీ చేయగలిగారు. ఆ తర్వాత మళ్లీ జేఎల్‌ పోస్టుల భర్తీ జరగలేదు. అంటే దాదాపు 10 ఏళ్ల వరకు ఎలాంటి పోస్టులను భర్తీ చేయలేదు. 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. దాదాపు లక్షకు పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం.  ఇదిలా ఉండగా.. దరఖాస్తులో తప్పులు దొర్లినట్లు కొంతమంది అభ్యర్థులు కమిషన్ కు విజ్ఞప్తి చేయగా.. ఎడిట్ కు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 17 వరకు తమ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు ఈ నాలుగు రోజులు అవకాశం కల్పించారు. అంటే నేటి నుంచి ఈ పోస్టులకు ఎడిట్ ఆప్షన్ ప్రారంభమైంది.

దీని కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ద్వారా ఆన్ లైన్ లో సవరించుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పరీక్షను జూన్ లేదా జులై 2023లో నిర్వహించనున్నారు. 27 సబ్జెక్టుల్లో.. మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు.

సబ్జెక్టుల వారీగా ఖాళీలు

 1. అరబిక్‌ పోస్టులు: 2

2.బోటనీ - 113

3. బోటనీ (ఉర్దూ మీడియం)-15

4.కెమిస్ట్రీ - 113

5. కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం) - 19

6. సివిక్స్ - 56

7.సివిక్స్ (ఉర్దూ మీడియం) - 16

8. సివిక్స్ (మారాఠీ) - 01

9. కామర్స్ - 50

10. కామర్స్ (ఉర్దూ మీడియం) - 07

11. ఎకనామిక్స్ - 81

12. ఎకనామిక్స్ (ఉర్దూ) - 15

13. ఇంగ్లీష్ - 81

14.ఫ్రెంచ్ - 02

15. హిందీ - 117

16. హిస్టరీ- 77

17. హిస్టరీ (ఉర్దూ మీడియం) - 17

18. హిస్టరీ (మరీఠీ మీడియం) - 01

19. మ్యాథ్స్ - 154

20. మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) - 09

21. ఫిజిక్స్ - 112

22. ఫిజిక్స్(ఉర్దూ మీడియం) - 18

23. సాంస్క్రీట్(Sanskrit) - 10

24. తెలుగు - 60

25. ఉర్దూ - 28

26. జువాలజీ - 128

27. జువాలజీ (ఉర్దూ మీడియం) - 18

పరీక్షవిధానం ఇలా..

మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో ఉంటుంది. పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. అయితే పేపర్ 2ని కూడా తెలుగు మీడియంలో నిర్వహించాలని తెలుగు మీడియంలో చదువుకున్న అభ్యర్థులకు కోరుతున్నారు. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials