Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 14 February 2023

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల..

 

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటికే ఏపీపీఎస్సీ(APPSC)  నుంచి పలు రకాలు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని నోటిఫికేషన్లకు(Notifications) సంబంధించి పరీక్షలు పూర్తి కాగా.. నియామకాలకు తుది దశకు చేరుకున్న నోటిఫికేషన్లు(Notifications) కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఏపీలో జాబ్ మేళాలను నిర్వహిస్తుండగా.. కాంట్రాక్ట్ (Contract), ఔట్ సోర్సింగ్(Out Sourcing) విధానంలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. తాజాగా పార్ట్ టైం విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు(Notification) సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఈ పోస్టులను పార్ట్ టైం విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తులు ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు.. తమ విద్యార్హత సర్టిఫికేట్లను శ్రీకాకులం జిల్లా సమన్వయాధికారి, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయ సంస్థ, ఆదివారంపేట , శ్రీకాకుళంకు అడ్రస్ కు ఫిబ్రవరి 16, 2023 సాయంత్రం 5 గంటల లోపు పంపించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి BSc నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్ అనేది శ్రీమతి గుంపుల గ్రేస్, జిల్లా సమన్వయాధికారి, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం సంస్థ శ్రీకాకుళంచే జారీ చేయబడింది. పూర్తి సమాచారం కొరకు అభ్యర్థులు ఫోన్ నంబర్లలో 08942-279926, 9701736862, 9000314209 సంప్రదించాలని కోరారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials