Mother Tongue

Read it Mother Tongue

Monday, 27 March 2023

జనాభా 800 కోట్లు

భూమిపై మొత్తం జనాభా 800 కోట్ల మార్కును దాటింది. 2022 నవంబర్ 15న '800 కోట్ల' శిశువు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జన్మించింది. ఈ చిన్నారి పాప జననంతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్లు ఐరాసకు చెందిన జనాభా నిధి (యూఎన్ఎఫ్ఎఎఎ) ప్రకటించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా, వచ్చే ఏడాదికల్లా (2023) భారత్ జనాభాలో అగ్రస్థానానికి చేరుకోనుంది.

  • ప్రస్తుతం భారత్ జనాభా 141.2 కోట్లు. చైనా జనాభా 142.6 కోట్లు. 2050లో భారత్ జనాభా 166.8 కోట్లు, చైనా జనాభా 131.7 కోట్లు కానుంది.
  • 2003లో భారత్లో జనాభా సగటు వయసు 28.7 సంవత్సరాలు. ఇది చైనాలో 38.4, జపాన్ లో 48.6 ఏళ్లు. ప్రపంచ జనాభా సగటు వయసు 30.3 ఏళ్లు. కొన్నేళ్లుగా జనాభా వృద్ధి నెమ్మదించింది. అయినప్పటికీ 2037 నాటికి 900 కోట్లకు, 2057 నాటికి 1,000 కోట్లకు చేరుకోనుంది.
  • 2080 దశకం నాటికి జనాభా 1,040 కోట్లకు చేరుకుంటుంది.
  • భారత్లో 15-64 ఏళ్ల మధ్య ఉన్న జనాభా 68 శాతం మంది. 65 ఏళ్లకు పైబడ్డవారు 7 శాతం. 27 శాతం మంది వయసు 15-29 ఏళ్లు. కౌమార వయస్కులు (10-19 ఏళ్ల మధ్య) 25.3 కోట్ల మంది ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం.
  • భారత్లో సంతాన సాఫల్యత రేటు తగ్గుతోంది. దేశంలో సరాసరిన ఒక మహిళకు పుట్టే పిల్లల సంఖ్య 2కు తగ్గింది.
  • మరోపక్క చైనాలో వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2035 నాటికి దేశంలో 60 ఏళ్లు పైబడ్డవారి సంఖ్య 40 కోట్లకు చేరుతుంది.
  • ప్రపంచ జనాభా వృద్ధి రేటు 1 శాతం కన్నా తక్కువగా ఉంది. అందువల్ల 900 కోట్ల మార్కును తాకడానికి మరో 15 ఏళ్లు పడుతుంది.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials