Mother Tongue

Read it Mother Tongue

Sunday, 26 March 2023

MTS-Clerk Posts అప్పర్ డివిజన్ క్లర్క్, MTS పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు ఇలా..

 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతకు శుభవార్త. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సైంటిస్ట్, అప్పర్ డివిజన్ క్లర్క్, క్లర్క్, MTS పోస్టుల కోసం 163 ఖాళీలను విడుదల చేసింది. దీని కోసం 10వ తరగతి నుండి గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు, కాలుష్య నియంత్రణ మండలి అధికారిక వెబ్‌సైట్ cpcb.nic.in సందర్శించడం ద్వారా మీరు మార్చి 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో, ఎంపికైన తర్వాత, వారికి నెలకు రూ. 18,000 నుండి రూ. 1 లక్ష 70,000 వరకు జీతం చెల్లించబడుతుంది.

ఖాళీల వివరాలు

 సైంటిస్ట్ 'బి' - 62

అసిస్టెంట్ లా ఆఫీసర్ - 6

అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్- 1

 సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 16

టెక్నికల్ సూపర్‌వైజర్- 1

అసిస్టెంట్ - 3

అకౌంట్స్ అసిస్టెంట్ - 2

జూనియర్ టెక్నీషియన్ - 3

సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్ - 15

అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) - 16

డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) – 3

జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ - 15

అప్పర్ డివిజన్ క్లర్క్ (LDC)-5

ఫీల్డ్ అటెండెంట్ - 8

మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 8

అర్హతలు..

పది, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుల చేసుకోచవ్చు.

దరఖాస్తు ఫీజు..

జనరల్, OBC, EWS అభ్యర్థులు రూ. 1000 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులురూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

వయో పరిమితి..

అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం..

163 పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు రూ.18 వేల నుంచి రూ.1 లక్షా 77 వేల 500 వరకు వేతనం ఇవ్వబడుతుంది.

 -అభ్యర్థులు ముందుగా cpcb.nic.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

-వెబ్‌సైట్ హోమ్ పేజీలో ప్రస్తుత ఉద్యోగాల లింక్‌పై క్లిక్ చేయండి.

-దరఖాస్తులో సూచించిన విధంగా వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్‌లో సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

-దరఖాస్తు చేసిన తర్వాత.. ప్రింట్ అవుట్ తీసుకోండి. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials