తెలంగాణ సెట్ (TS - SET-2023) నోటిఫికేషన్ ను ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కాగా.. ఈ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29తో ముగిసింది. అయితే రూ.2000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 18 వరకు అవకాశం కల్పించారు. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. ఇక రూ.3 వేలు ఆలస్య ఫీజుతో సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తు సమర్పించవచ్చు. ఇటీవల ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 12తో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుందని పేర్కొనగా.. వాటి తేదీలను మార్చారు. కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (CBT) విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2 పరీక్ష 100 ప్రశ్నలకు 300 మార్కులను కేటాయించనున్నారు. పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. ఇతరత్రా సమాచారం కోసం www.telanganaset.org, www.osmania.ac.in అనే వెబ్‌సైట్లను సందర్శించొచ్చు. ఈ ఏడాది మార్చి 14, 15, 17వ తేదీల్లోనూ సెట్ పరీక్ష ను నిర్వహించింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ సెట్ పరీక్షలకు మొత్తం 50,256 మంది దరఖాస్తు చేసుకోగా.. 40,128 మంది హాజరయ్యారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో టీఎస్ సెట్ నిర్వహించనున్నారు. ఇంకా దరఖాస్తులు సమర్పించని అభ్యర్థులు ఈ కింద తెలిపిన స్టెప్స్ ద్వారా తమ ఫారమ్ సమర్పించవచ్చు.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 5
- దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 29
- రూ.1500 లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 4
- రూ.2 వేల లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 18
- రూ.3 వేల లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 24
- దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్: సెప్టెంబర్ 26, 27
- హాల్ టికెట్ల డౌన్ లోడ్: అక్టోబర్ 20 నుంచి
- పరీక్ష తేదీలు: అక్టోబర్ 28, 29, 30
పరీక్ష సెంటర్లు
ఆదిలాబాద్ , నిజామాబాద్, విజయవాడ , హైదరాబాద్ , వరంగల్, కర్నూలు , కరీంనగర్, ఖమ్మం, తిరుపతి , మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష తీరు
జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్టుల్లో సెట్ రాసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
- అభ్యర్థులు ముందుగా http://telanganaset.org/index.htm వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- అప్లయ్ ఆన్ లైన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఇక్కడ మీకు దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
- మీ వివరాలతో పాటు విద్యార్హతలను ఎంటర్ చేయాలి. ఇందులోనే మీరు ఎగ్జామ్ సెంటర్ ను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది.
- వివరాల ఎంట్రీ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్ లైన్ పేమెంట్ విధానం కూడా అందుబాటులో ఉంది.
- ఫైనల్ గా సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
14/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
16/09/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
15/09/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
14/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment