నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) లో 193 అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిని ఇంటర్వ్యూ ద్వారా నింపుతారు.
ట్రేడ్ అప్రెంటిస్ లో 147 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. దీనికి విద్యార్హత ITI (సంబంధిత ట్రేడ్), NCVT/SCVT కలిగి ఉండాలి. ఈ ఖాళీలు నింపడానికి ఏప్రిల్ 15, 16 మరియు 18 నుండి 20 వరకు ఇంటర్వ్యూ లు జరుగును.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లో 38 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. దీనికి విద్యార్హత డిప్లొమా లేదా డిగ్రీ కలిగి ఉండాలి. ఈ ఖాళీలు నింపడానికి ఏప్రిల్ 21 నుండి 23 వరకు ఇంటర్వ్యూ లు జరుగును.
టెక్నీషియన్ అప్రెంటిస్ లో 09 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. దీనికి విద్యార్హత డిప్లొమా కలిగి ఉండాలి. ఈ ఖాళీలు నింపడానికి ఏప్రిల్ 25 మరియు 26 న ఇంటర్వ్యూ లు జరుగును.
ఈ ఉద్యోగాలకు కనీస వయసు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 30 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ చదవండి. ఈ నోటిఫికేషన్ దీనిఫై క్లిక్ చేసి పొందగలరు.
No comments:
Post a Comment