స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10 + 2) కింద 3712 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 07, 2024. దరఖాస్తు రుసుము రూపాయలు 100/- , కానీ మహిళలకు, SC, ST, PWD, మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము పూర్తిగా మినహాయింపు ఉంటుంది. 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వరకు అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. వయసు సడలింపు నిబంధనల ప్రకారం ఉంటుంది. విద్యార్హత ఇంటర్. లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రెటరియేట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
కొన్ని ముఖ్యమైన లింక్స్
ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment