AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో వివిధ రకాల ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 247 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలనీ నిర్ణయించారు. ధరఖాస్తూ రుసుము 500/- రూపాయలు. కానీ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబల్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కి ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. డిమాండ్ డ్రాఫ్ ద్వారా చెల్లించాలి. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఖాళీలను నింపనున్నారు. వివిధ రకాల ఖాళీలకు వివిధ తేదీలలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
డిప్యూటీ టెర్మినల్ మేనేజర్, డ్యూటీ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ పాసెంజర్, జూనియర్ ఆఫీసర్ టెక్నికల్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మార్చ్ 15 నుండి మార్చ్ 16, 2024 వరకు ఇంటర్వ్యూలు జరుగును. రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మరియు యుటిలిటీ ఏజెంట్ కమ్ ఏజెంట్ డ్రైవర్ పోస్టులకు మార్చ్ 17 మరియు మార్చ్ 18, 2024 న ఉదయం 09:30 నుండి 12:30 వరకు ఇంటర్వ్యూలు జరుగును. హాండీమెన్ మరియు హ్యాండీవుమన్ పోస్టులకు మార్చ్ 19 మరియు మార్చ్ 20, 2024 న ఉదయం 09:30 నుండి 12:30 వరకు ఇంటర్వ్యూలు జరుగును.
ఉద్యోగ ఖాళీలు
డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ లో 02, డ్యూటీ ఆఫీసర్ లో 07, జూనియర్ ఆఫీసర్ పాసెంజర్ లో 06, జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ లో 7, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లో 47, రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లో 12, యుటిలిటీ ఏజెంట్ కమ్ ఏజెంట్ డ్రైవర్ లో 17, హాండీమెన్ లో 119 మరియు హ్యాండీవుమన్ లో 30 పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత
వివిధ రకాల పోస్టులకు వేరు వేరు విద్యార్హతలు కలిగి ఉండాలి. పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు పోస్టును భట్టి నిర్ణయించారు. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ లో చుడండి.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం
పూణే అంతర్జాతీయ పాఠశాల సర్వే నెం. 33, లేన్ సంఖ్య 14, టింగ్రే నగర్, పూణే మహారాష్ట్ర - 411032
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment