పోటీపరీక్షలలో కరెంటు అఫైర్స్ తో పాటు ఇతర అంశాలను ఎలా చదవాలి?.. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ మాటల్లో..
పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడును. అయితే ఈ వీడియో T-SAT యూట్యూబ్ ఛానల్ లో నిన్న విడుదల చేసారు.
ఈ వీడియోలో ప్రధానంగా న్యూస్ పాపపేర్స్ చదవడం వల్ల పోటీపరీక్షలలో కలిగే లాభాల గురుంచి చెప్పడం జరిగింది.
ఈ వీడియోలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు టీచబుల్ మూవ్మెంట్ (Teachable Movement) గురుంచి వివరించడం జరిగింది.
అస్సలు టీచబుల్ మూవ్మెంట్ అంటే ఏమిటి? ఏ సమయంలో ఏమి చెబితే సరిగ్గా అర్ధం అవుతుందో ఆ సమయం లో చెప్పాలి.
ఉదాహరణకు మనిషి కష్టాల్లో ఉన్నపుడు వైరాగ్యం చెబితే (వేదాన్తమ్) ఎక్కువ అర్ధం అవుతుంది (ఏముంది ఈ జీవితం అని). కానీ సుఖ సంతోషాలతో జీవిస్తున్న వారికి వేదాంతం చెప్పితే వారు పట్టించుకోరు.
పై అంశాలను బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలంటే .. న్యూస్ పేపర్స్ అనేవి కరెంటు అఫైర్స్ కోసం తయారు చేసినవి కావు. కానీ ఏ అంశాలు మనకు ఉపయోగాపడుతాయి అని తెలుసుకోవాలి. ఉదాహరణకు భర్తను చంపినా భార్య లేదా భార్య ను చంపినా భర్త, రెండు బస్సులు ఢీ - నలుగురు మృతి. ఈ వార్తలు పోటీపరీక్షలకు ఉపయోగపడవు. ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు అని న్యూస్ పాపపేర్స్లో రాసినట్టైతే.. ఈ వార్త మనకు ఉపయోగ పడుతుంది. ఈ వార్త లో మనకు ఉపయోగపడే అంశాలు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? సభ్యులు ఎవరు? ఇది ఎన్నవ ఫైనాన్స్ అంతకు ముందు ఫైనాన్స్ కమిషన్ లో సభ్యలు ఎవరు ఉన్నారు. ఇలాంటి సమాచారం ఈ వార్త లో ఉంటుంది.
న్యూస్ పాపేపర్స్ లో టీచబుల్ మూవ్మెంట్ వచ్చి న్యూస్ రిలేటెడ్ పాలిటి, ఎకానమీ, మరియు ఇతర అంశాలు చదవడం. ఇలా చదివితే సబ్జెక్టు ని చాల సులువుగా గుర్తు ఉంటుంది.
చంద్రయాన్ II ప్రయోగం జరిగినప్పుడు, అప్పోజి అంటే ఏమిటి? వెలాసిటీ అంటే ఏమిటి? ఓజోన్ లేయర్ అంటే ఏమిటి? ఈ అంశాలు మనకు సులువుగా గుర్తుఉండిపోతాయి. స్పేస్ సైన్స్ గురుంచి సాధారణ సమయాల్లో చదివిన దాని కన్నా చంద్రయాన్ ప్రయోగ సమయాల్లో చదివితే అది టీచబుల్ మూవ్మెంట్.
న్యూస్ పేపెర్స్ చదవటం వల్ల కలిగే లాభాలు.. టీచబుల్ మూవ్మెంట్, కరెంటు అఫైర్స్. వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు.. ఇలాంటి సమకాలీన పరిణామాలు మనకు న్యూస్ పేపర్స్ లో దొరుకుతాయి.
సోర్స్: T-SAT యూట్యూబ్ వీడియో
No comments:
Post a Comment