Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 20 August 2024

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ప్రైవేట్ ఉద్యోగాలు... ఆగస్ట్ 21న జాబ్ మేళా

ప్రైవేట్ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆగస్ట్ 21న జాబ్ మేళా జరగనుంది.

నిరుద్యోగం అనేది భారతదేశ ఆర్థిక రంగాన్ని సవాలు చేస్తూనే ఉన్న ఒక క్లిష్టమైన సమస్య. మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. అయితే నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి.

నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. దీంతో అనేకమంది అభ్యర్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలను పొందుతున్నారు.

దాంతోపాటు ఇటు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పలుచోట్ల జాబ్ మేళాలను సైతం నిర్వహిస్తుంది.పలు స్వచ్ఛంద సంస్థలు సైతం నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పలుచోట్ల జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. దీంతో అనేక మంది యువతి, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలను సాధిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 21న జాబ్ మేళా నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లా ములుగు రోడ్డులోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి కల్పించేందుకు హైదరాబాదుకు చెందిన జోషిత గ్రూప్ రిలిస్టేట్ మరియు జ్యోతి ఎంటర్ప్రైజెస్ వారు ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీలలో ఖాళీగా ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మరియు జ్యోతి ఎంటర్ప్రైజెస్ లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టులకు జాబ్ మేళా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కంపెనీలో 90 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అదేవిధంగా జ్యోతి ఎంటర్ప్రైజెస్ లో 15 టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 25 ఏళ్లలోపు వయస్సు గల పురుష అభ్యర్థులు ఇందుకు అర్హులు. ఇంటర్,ఐటిఐ, డిప్లమా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు.

అయితే గతంలో కూడా ఉపాధి కల్పన కార్యాలయంలో అనేక జాబ్ మేళాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు.ఈ జాబ్ మేళాలో వేల సంఖ్యలో అభ్యర్థులు పాల్గొని ఉద్యోగాలను పొందడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 21న ములుగు రోడ్డులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు.

ఆసక్తి,అర్హత కలిగిన పురుష అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు తమ వెంట విద్యార్హత సర్టిఫికెట్లు మరియు ఆధార్ కార్డు,పాస్ ఫోటోలతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 78933 94393 నెంబర్ ను సంప్రదించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials