ఐ.టి.ఐ. పాస్ అయిన అభ్యర్ధులు
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి లో అప్రెంటిస్ షిప్ కొరకు ఆన్ లైన్ లో తమ పేర్లను నమోదు
చేసుకోవాలని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి, అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఐ.టి.ఐ. పాస్ అయిన అభ్యర్ధులు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి లో అప్రెంటిస్ షిప్ కొరకు
ఆన్ లైన్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి, అధికారులు ఓ
ప్రకటనలో తెలిపారు.
పేర్లను నమోదు చేసుకున్న వారు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొరకు, ఈ దిగువ
తెలుపబడిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో (వెరిఫికేషన్ నిమితమై) పాటు ఆయా
జిల్లాలకి తెలియచేసిన తేదీలలో హాజరు కావలెను అని తెలిపారు. ఒరిజినల్
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ టైం లో ఒక సెట్ జెరాక్స్ కాపీలను కూడా
తీసుకురావలెను.
కావలసిన పత్రాలు :
(1) రిజిస్ట్రేషన్ ఫారం, (2) S.S.C
మార్క్స్ లిస్టు, (3) ITI మార్క్స్ లిస్టు, (4) కుల దృవీకరణ పత్రం(SC, ST
& BCలు మాత్రమే) (5) మండల కార్యాలయము నుండి పొందిన నివాస దృవీకరణ
పత్రము (6) ఎన్.సి.సి/స్పోర్ట్స్, (7) ఆధార్ కార్డు (8) PHC సర్టిఫికేట్
(9) BIO DATA FORM (10) EX-SERVICE MAN (తండ్రి యొక్క) దృవీకరణ (11)
పోస్టల్ చిరునామా
జిల్లా,ఆయా తేదీలు :
విశాఖపట్నం మరియు పార్వతీపురం
మన్యం జిల్లాలు 22.08.2024 , డాక్టర్, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమమరియు
విజయనగరం జిల్లాలు 23.08.2024 , అనకాపల్లి, అల్లురి సీత రామ రాజు మరియు
కాకినాడ జిల్లాలు 24.08.2024 , తూర్పు గోదావరి మరియు శ్రీకాకుళం జిల్లాలు
27.08.2024 ఈ వెరిఫికేషన్ లో ఒక జిల్లాలో సంబంధిత ట్రేడ్ నందు ఖాళీలు లేని
యెడల, వేరే జిల్లాలలో పని చేయుటకు అంగీకార పత్రమును సర్టిఫికెట్స్
వెరిఫికేషన్ టైమునందు వ్రాసి ఇవ్వవలెను.
సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సమయంలో రూ.118/- (ప్రాసెస్సింగ్ ఫీ నిమిత్తమై
(రుసుము 100/- + మరియు GST 18/-) చెల్లించి తగు రశీదు పొంది దరఖాస్తుతో
జతపరచి జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ కార్యాలయం, విజయనగరంలో అందజేయవలెను.
తగు సహాయం కొరకు మీ జిల్లాకు చెందిన గవర్నమెంట్ ఐ.టి.ఐ అప్రెంటిస్ అడ్వైజర్
వారిని కూడా సంప్రదించ వచ్చును. ఇది వరకే సెలెక్ట్ కాబడి, అప్రన్టిషిఫ్
పూర్తి చేసిన అభ్యర్ధులు ధరఖాస్తు చేయరాదు. అట్టి ధరఖాస్తులను
పరిశీలించబడవు అని తెలిపారు.
అప్లై ఆన్లైన్ ఉద్యోగాలు:
SSC CHTE
(25/08/2024 Last Date)
ఎక్సమ్ డేట్స్:
SSC MTS
(30-09-2024 to 14-11-2024 Exam Date)
ఎక్సమ్ కాల్ లెటర్ డౌన్లోడ్:
IBPS CRP Clerk XIV
(24, 25, & 31-08-2024 Exam Date)
RRB ALP
(28-08-2024 to 06-09-2024 Exam Date)
స్టడీ మెటీరియల్స్:
Quantitative Aptitude
Study Material
No comments:
Post a Comment