ఉచిత మెగా డీఎస్సీ శిక్షణను పొందుటకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 10వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 01.30 గంటల వరకు జరుగు స్క్రీనింగ్ టెస్ట్ కు హాజరు కావలెనని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ, అమరావతి వారి ఉత్తర్వుల మేరకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మెగా డీఎస్సీ ద్వారా ఎస్.జి.టి మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల నిమిత్తం ఉచిత బోధన, భోజన మరియు వసతి సౌకర్యములతో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చుటకు నిర్ణయించడం జరిగిందని, ఉచిత మెగా డీఎస్సీ శిక్షణను పొందుటకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్ కు హాజరు కాగలరని తెలిపారు.
స్క్రీనింగ్ పరీక్ష చిత్తూరు జిల్లా కేంద్రంలోని మురకంబట్టు వద్దగల సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాల, ఎస్.వి. సెట్ ఇంజనీరింగ్ కళాశాల, పూతలపట్టు మండలం పి. కొత్తకోట వద్ద గల వేము ఇంజనీరింగ్ కళాశాల, గంగవరం మండలం మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్నదని తెలిపారు. డీఎస్సీ శిక్షణను పొందుటకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్ హాజరు అవుటకు https://jananabhumi.ap.gov.in వెబ్ సైట్ నందు హాల్ టికెట్లు వెబ్ సైట్ నుండి పొందగలరన్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 10.00 గంటలలోపు సంబంధిత సెంటర్లకు హాజరు కావలన్నారు. పరీక్ష కేంద్రము లోపలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవన్నారు. అభ్యర్థులు వెబ్సైట్ నుండి పొందిన హాల్ టికెటు మరియు ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు పొందిన కార్డుతో పాటు పరీక్ష కేంద్రమునకు అనుమతించబడునని జిల్లా కలెక్టర్ సుకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment