Mother Tongue

Read it Mother Tongue

Monday, 21 July 2025

ఉద్యోగ మేళా.. 10 పాసైతే చాలు బంపర్ ఆఫర్



 పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఖుషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ లో 67 పోస్టుల ఉద్యోగాలకు సంబంధించి జిల్లా ఉపాధి కల్పన అధికారి వై. తిరుపతి ప్రకటన విడుదల చేసారు. ఈ నెల 24వ తేదీన సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రూమ్ నెంబర్ 225లో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉద్యోగాల పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

సేల్స్ ఎగ్జిక్యూటివ్ లో 60 ఖాళీలు, ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ 4, హెచ్ ఆర్ మేనేజర్ 2, ఆఫీస్ బాయ్ 1.. ఈ ఖాళీలకు ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ ఆపై చదివిన వారు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు గలవారు మాత్రమే అర్హులు.

ఆసక్తి ఉన్న యువతి యువకులు జూలై 24వ తేదీన ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్స్ జిరాక్స్ లతో జిల్లా సమీకృత కలెక్టరేట్ లో రూమ్ నెంబర్ 225 గల జిల్లా ఉపాధి కార్యాలయం లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఉపాధి కల్పన అధికారి తిరుపతి ప్రకటన ద్వారా తెలిపారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా లేదా వివరాలు తెలుసుకోవాలన్నా ఈ నంబర్లను సంప్రదించవచ్చు: 9391420932, 8985336947, 8121262441.


No comments:

Post a Comment

Job Alerts and Study Materials