తెలుగు అకాడమీలో ఉద్యోగాల భర్తీ అంటూ ప్రచారం అవుతున్న నోటిఫికేషన్ నకిలీదని తెలుగు, సంస్కృతి అకాడమీ డైరెక్టర్ వి. రామకృష్ట తెలియపరిచారు. ఇటువంటి నకిలీ నోటిఫికేషన్ల పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగు అకాడమీలో ఉద్యోగాలు అంటు.. ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో పాటు.. వెబ్ సైట్ కూడా లాంచ్ అయినట్లు చూపించారు. అయితే ఇదంత నకిలీది అంటూ తెలుగు అకాడమీ పేర్కొంది. తెలుగు అకాడమీలో ఉద్యోగాల భర్తీ అంటూ చలామణీ అవుతున్న నోటిఫికేషన్ నకిలీదని తెలుగు, సంస్కృతి అకాడమీ డైరెక్టర్ వి. రామకృష్ట వెల్లడించారు. ఇటువంటి ఫేక్ నోటిఫికేషన్ల పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. వెబ్ సైట్ ను https://teluguacademy.org/సందర్శించి దరఖాస్తులు చేసుకోవాలని ఫేక్ వెబ్ సైట్ ను స్పష్టించారని తెలిపారు. తెలుగు అకాడమీ విజయవాడకు ఇంత వరకు వెబ్ సైట్ లేదంటూ వివరణ ఇచ్చారు. జనరల్, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మార్చి 27 నుంచి ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయిందని కూడా ప్రకటించారు. అంతే కాకుండా మొత్తం 156 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. ఇదంతా వాట్సాప్ గ్రూప్ లో సర్క్యూలేట్ అయిందని.. ఇది గుర్తు తెలియని ఎవరో అకాడమీ పేరుతో ఒక ఫేక్ వెబ్ సైట్ స్పష్టించారు అని అన్నారు. అయితే ఈ వెబ్ సైట్.. ఉద్యోగ నోటిఫికేషన్ పై సందేహాలు తలెత్తిన కొంత మంది అభ్యర్థులు విజయవాడ తెలుగు అకాడమీ దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు దీనిపై క్లారిటీ ఇచ్చారు. అటువంటి నోటిఫికేషన్లు తాము ఇవ్వలేదంటూ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అకాడమీ అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తెలుగు అకాడమీ నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదని .. నకిలీ నోటిఫికేషన్లపై అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.
Showing posts with label నకిలీ నోటిఫికేషన్. Show all posts
Showing posts with label నకిలీ నోటిఫికేషన్. Show all posts
Subscribe to:
Posts (Atom)
Job Alerts and Study Materials
-
▼
2025
(237)
-
▼
July
(6)
- నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట...
- AAICLAS సెక్యూరిటీ స్క్రీనర్ రిక్రూట్మెంట్ 2025 -...
- నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ బరోడా లోకల్ బ...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ నేవీ నావల్ సివిలి...
- నిరుద్యోగులకు శుభవార్త.. SSC జూనియర్ ఇంజనీర్ రిక్ర...
- నిరుద్యోగులకు శుభవార్త.. IBPS PO నోటిఫికేషన్ 2025 ...
-
▼
July
(6)