Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 1 March 2023

రూ.89,000 వేతనంతో బ్యాంక్ జాబ్స్... 2 రోజులే గడువు

బ్యాంక్ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఐడీబీఐ బ్యాంకులో పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. రూ.89,000 వేతనంతో బ్యాంక్ జాబ్స్ (Bank Jobs) ఉన్నాయి. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. ఐడీబీఐ బ్యాంకులో (IDBI Bank) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇటీవల జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 114 పోస్టులున్నాయి. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకులో 600 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మరో 114 పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2023 మార్చి 3 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. మొత్తం 114 ఖాళీలు ఉండగా అందులో మేనేజర్- 75, అసిస్టెంట్ జనరల్ మేనేజర్- 29, డిప్యూటీ జనరల్ మేనేజర్- 10 పోస్టులున్నాయి. విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. బీసీఏ, బీఎస్‌సీ (IT), బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్‌సీ (IT), ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, ఎంఏ, ఎంఎస్‌సీ లాంటి కోర్సులు పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు వివరాలు చూస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ.200 ఫీజు చెల్లించాలి. వేతనం- డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు రూ.89,892. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుకు రూ.78,230. మేనేజర్ పోస్టుకు రూ.69,810. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.idbibank.in/ అధికారిక వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి. Recruitment of Specialist Officer నోటిఫికేషన్‌తో ఓ సెక్షన్ కనిపిస్తుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి. కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి. మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. రెండో దశలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి. ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి. ఆరో దశలో ఫీజు పేమెంట్ చేయాలి.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials