ఏపీలో గ్రూప్-1, 2 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రూప్-1. గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీకి సీఎం వైయస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రికి అధికారులు ఈపోస్టుల భర్తీపై వివరాలు అందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు. గ్రూప్-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే నెలలోగా విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల నుంచి తెలుస్తోంది.

No comments:
Post a Comment