మార్చి-ఏప్రిల్ 2023లో నిర్వహించిన తుది రాత పరీక్షల (FWEలు) ఫలితాలకు సంబంధించి ప్రాసెస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మొత్తం 8 నోటిఫికేషన్లకు సంబంధించి ఫైనల్ రాత పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఏప్రిల్ 30వ తేదీన సివిల్, ట్రాన్స్ పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్షను నిర్వహించారు. వీటికి మొత్తం 1,08,055 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. వీటిలో 98,218 మంది అర్హత సాధించారు. మొత్తంగా 90.90 శాతం అర్హత సాధించారు. అయితే వీటి ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన చేసింది. ఎంత మంది ఈ పోస్టులకు అర్హత సాధిచారనే వివరాలను పొందుపరిచారు. ఎస్సై సివిల్ ఉద్యోగాలకు 57,848 మంది పరీక్ష రాయగా.. 43,708 మంది అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. అంటే 75 శాతం పాస్ పర్సెంటేజ్ ఉంది. పీసీ ఐటీ ఉద్యోగాలకు 4,564 మంది అర్హత సాధించగా.. ఐటీ ఎస్సై ఉద్యోగాలకు 729 మంది అర్హత సాధించారు. కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాలకు 1779 మంది అర్హత సాధించగా.. ఫింగర్ ప్రింట్ బ్యూరో ఉద్యోగాలకు 1153 మంది అర్హత సాధించారు. ఇక పీటీఓ ఎస్సై ఉద్యోగాలకు 463 మంది అర్హత సాధించగా.. పీసీ మెకానిక్ ఉద్యోగాలకు 238 మంది అర్హత సాధించారు. మొత్తం అన్ని ఉద్యోగాలకు సంబంధించి 84 శాతం మంది అర్హత సాధించినట్లు తెలిపారు. ఇక అభ్యర్థుల యొక్క పర్సనల్ లాగిన్ లో ఓఎంఆర్ షీట్లను నేడు రాత్రి అప్ లోడ్ చేయనున్నట్లు వెబ్ నోట్ లో పేర్కొన్నారు. దీంతో పాటే.. అభ్యర్థి యొక్క ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. పర్సనల్ లాగిన్ ద్వారా ఈ వివరాలను తెలియనున్నాయి. అయితే.. మెరిట్ జాబితా ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాలను వెబ్ నోట్లో పొందుపరచలేదు. వీటిని జూన్ రెండో వారంలో విడుదల చేయనున్నారు. అంతేకాకుండా.. తమకు ఏమైనా ఓఎంఆర్ పత్రాల్లో కరెక్షన్స్ కు సంబంధించి అభ్యంతరాలు ఉంటే.. అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చని వెబ్ నోట్లో తెలియజేశారు. దీని కోసం రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.2వేలు చెల్లించాలి. ఈ అవకాశం జూన్ 01 నుంచి జూన్ 03 వరకు కల్పించారు. వీటితో పాటే.. అప్లికేషన్ ఎడిట్ కు కూడా అవకాశం కల్పించారు. తమ దరఖాస్తులో ప్రయారిటీ.. తప్పులను సరి చేసుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

No comments:
Post a Comment