తెలంగాణలో ఇటీవల జరిగిన ఎస్ఐ మెయిన్స్ పరీక్ష (TSLPRB SI Exam) రాసిన విద్యార్థులకు అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఈరోజు అంటే మే 11 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తెలిపింది.ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి బోర్డు అధికారిక వెబ్ సైట్ లో అందుబుటులో ఉంటుందని బోర్డు తెలిపింది. కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ఈ నెల 14వ తేదీ వరకు తెలపాలని సూచించింది. కీపై అభ్యంతరాలను అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా సమర్పించాలని బోర్డు సూచించింది. తమ అభ్యంతరాలకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లను పీడీఎఫ్/జేపీఈజీ ఫార్మాట్లో అప్ లోడ్ చేయాలని తెలిపారు. ఏఎస్‌ఐ ఎఫ్‌పీబీ, ఎస్‌ఐ ఐటీ అండ్ సీఓ టెక్నికల్ పేపర్ల (ఆబ్జెక్టివ్ టైప్) తుది పరీక్షలను మార్చి 11న, ఎస్‌ఐ పీటీవో పరీక్షను మార్చి 26న, అరిథ్‌మెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ పేపర్లను ఏప్రిల్ 8న, జనరల్ స్టడీస్ పేపర్ల ఫైనల్ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 9న నిర్వహించారు.
ముఖ్యమైన లింక్స్
- ప్రెస్ నోట్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment