గురుకుల పరీక్షలను ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే వీటి పరీక్షలకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ ను విడుదల చేశారు. అభ్యర్థుల యొక్క వ్యక్తిగత లాగిన్ ద్వారా రెస్పాన్స్ షీట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ఇక్కడ క్లిక్ చేయండి. తెలంగాణలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లు ఆగస్టు 01వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పోస్టులవారీగా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. నేటితో పరీక్షలు కూడా పూర్తయ్యాయి. అయితే వీటికి సంబంధించి ప్రాథమిక కీని విడుదల చేశారు. కీలో ఏమైనా అభ్యంతరాలుంటే.. అబ్జెక్షన్స్ కు కూడా అవకాశం కల్పించారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులతో పరీక్షలు ప్రారంభం కాగా.. అనంతరం టీజీటీ, పీజీ టీ, డీఎల్, జేఎల్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు సబ్జెక్టులవారీగా పరీక్షలను నిర్వహించారు. ఎ స్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి 9 క్యాటగిరీల్లో పీజీటీ- 1,276, టీజీటీ-4,020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ -2,876, టీజీటీ, స్కూల్ లైబ్రేరియన్- 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ -275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్-226, మ్యూజిక్ టీచర్ -124 పోస్టులు మొత్తంగా 9,210 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ట్రిబ్ ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. అన్ని పోస్టులకు కలిపి 2,63,045 దరఖాస్తులు వచ్చాయని ట్రిబ్ ఇప్పటికే వెల్లడించింది. పోస్టుల్లో అత్యధికంగా మహిళలకే కేటాయించారు. మొత్తం 23వ తేదీ వరకు 17 జిల్లాల్లో 106 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించిన గురుకుల నియామక సంస్థ.. పరీక్షలు ముగిసిన రోజే రెస్పాన్స్ షీట్స్ విడుదల చేసి.. రికార్ట్ స్పష్టించింది.
ముఖ్యమైన లింక్స్
- రెస్పాన్స్ షీట్స్ కొరక ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment