
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రీసోర్స్పర్సన్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రీసోర్స్పర్సన్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒప్పంద ప్రాతిపదికన ఏడాది పాటు పనిచేసేందుకు ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. మొత్తం 396 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల కాగా..సెప్టెంబర్ 4 నుంచి 18వ తేదీ రాత్రి 11.59గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు http.apie.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు. వీటికి ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించన్నారు. ఇతర పద్దతుల ద్వారా దరఖాస్తులను స్వీకరించరు. దరఖాస్తు చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున సడలింపు ఇచ్చారు. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు, విద్యార్హతల వివరాలను వెబ్సైట్లో ఉంచిన పూర్తి నోటిఫికేషన్ద్వారా పొందొచ్చని శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థుల మెరిట్ లిస్ట్ జాబితాకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment