Mother Tongue

Read it Mother Tongue

Thursday, 19 September 2024

ప్రైవేట్ రంగంలో వందల్లో ఉద్యోగాలు...త్వరపడండి..

 నిరుద్యోగులకు శుభవార్త, ప్రైవేట్ రంగంలో వందల సంఖ్యలో ఉద్యోగాలు.. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వారికి మంచి ఆవకాశం. ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నమని, మంచి శాలరీతో మీ సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశాన్ని ఉందని జిల్లా ఉపాధి అధికారి బి. పి. మధుసూదన్ రావు ఓ ప్రకటన జారీచేశారు.

నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 20న మెగా జాబ్ మేళా ఉంది. ప్రైవేట్ రంగంలో మంచి శాలరీతో ఉద్యోగం పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి బి. పి. మధుసూదన్ రావు తెలిపారు.  సీఎంఆర్ షాపింగ్ మాల్,BFIL కంపెనీ వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతారు. ఉద్యోగాలు : (భారత్ మనీ ఆఫీసర్, ఫ్లోర్ సూపర్ వైజర్,  సేల్స్ మెన్స్,  రిసీవింగ్ స్టాఫ్,  సెక్యూరిటీ స్టాఫ్, ఐటీ ఎగ్జిక్యూటివ్ సుమారుగా 5 వందల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

విద్యా అర్హతలు:  పది,  ఇంటర్, డీగ్రి, పాసైనా మగ వారు, ఆడ వారు అర్హులు. నిజామాబాద్, మేడ్చల్, హైదరాబాద్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20న ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం వరకు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీ నగర్, నిజామాబాద్ లో హాజరుకాగలరన్నారు. ఇతర వివరాలకు, 95817 68413, 99487 48428, 63057 43423,77022 59070 ఈ ఫోన్ నంబర్లను ద్వారా సంప్రదించగలరు. అభ్యర్థులు తమ బయో డేటా, ఆధార్ కార్డు, 10 క్లాస్ మెమో, ఫోటో తీసుకురాగలరని తెలిపారు.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials