అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.. ఇంకో వారం రోజులే గడువు ఉంది. మహిళలు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇంటి వద్ద నుంచే జాబ్ చేసుకుంటూ ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు.
రొంపిచెర్ల, పులిచెర్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ నాగశైలజ ఒక ప్రకటనలో కోరారు. పులిచెర్ల మండలంలో ఆర్.కుమ్మరపల్లె, చెన్నుపాటివారిపల్లెలో మినీ అంగన్వాడీ కార్యకర్త, కావేటిగారిపల్లెలో హెల్పర్, రొంపిచెర్ల మండలంలోని బోడిపాటివారి పల్లెలో హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 21-35 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులన్నారు. ఈ నెల 21వ తేదీ లోపు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని, అభ్యర్థులు స్థానికులై ఉండాలన్నారు.
వలమనేరు ఐసీడీఎస్ పరిధిలోని గంగవరం, బందార్లపల్లె అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక సీడీపీఓ ఇందిరా ప్రియదర్శిని ఓ ప్రకటనలో కోరారు. అభ్యర్థులు స్థానికులై ఉండాలని, పదోతరగతి పాసై 21 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులని తెలియజేశారు. ఇతర వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. పుంగనూరు, సోమల మండలాల్లో.. పుంగనూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ రాజేశ్వరి ఒక ప్రకటనలో కోరారు.
మండలంలోని రాంనగర్, ఆరడిగుంట, సోమల మండలంలోని ఫిరంగులగుట్ట, ముండ్రివా రిపల్లెలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈనెల 12 నుంచి 21వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తులు తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. వీ.కోట మండలం: మండలంలోని గాండ్లపల్లె, పాపేపల్లె అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకురాల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ మాధవిలత ఓ ప్రకటనలో తెలిపారు. స్థానికులై ఉండాలని, పదవ తరగతి పాసైన 21 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు అర్హులని తెలియజేశారు.
గుడుపల్లె మండలంలో…. గుడుపల్లె మండలం జాతికర్తనపల్లెలో అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ ఇన్చార్జి సీడీపీఓ కృష్ణ వేణి ఒక ప్రకటనతో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణురాలై, స్థానికంగా నివాసం ఉంటున్న బీసీ-ఏ కేటగిరి మహిళలు అర్హులని చెప్పారు. ఈ నెల 21వ తేదీ లోపు దరఖాస్తులు ఇవ్వాలన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయం పని వేళల్లో సంప్రదించాలన్నారు.
No comments:
Post a Comment