ఏపీలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (KGBV) టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో 604 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి గాను అంటే ఏడాది కాలానికి బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను ఫిల్ చేస్తున్నారు. ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్ బేసిస్), ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టుల భర్తీ జరగనుంది.
మొత్తం 604 ఖాళీల్లో.. ప్రిన్సిపల్ పోస్టులు- 10, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) పోస్టులు- 165, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) పోస్టులు- 4, సీఆర్టీ (CRT) పోస్టులు- 163, పార్ట్ టైం టీచర్ (PTT) పోస్టులు-165, వార్డెన్ పోస్టులు- 53, అకౌంటెంట్ పోస్టులు- 44 ఉన్నాయి.
అప్లై చేసే పోస్టును బట్టి అర్హతలు పొందుపరిచారు. ఎంపికైన అభ్యర్థుల్లో ప్రిన్సిపాల్ పోస్టులకు రూ.34,139, పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) పోస్టులకు రూ.26,759, పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులకు రూ.26,759, సీఆర్‌టీ (కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్) పోస్టులకు రూ.26,759 జీతం ఇస్తారు.
ఈ పోస్టులకు గాను దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 26న ప్రారంభం కాగా.. అక్టోబర్ 10వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. మహిళలకే చెందిన ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్ విజిట్ చేయొచ్చు.
No comments:
Post a Comment