తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ (TGMSC), హైదరాబాద్ ఆధ్వర్యంలో UPSC సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) 2025 పరీక్షలకు సిద్ధమవుతున్న మైనారిటీ వర్గాల అభ్యర్థుల కోసం ఉచిత కోచింగ్ కార్యక్రమం నిర్వహించబోతోంది.
కోచింగ్ స్థలం: ఈ శిక్షణ హైదరాబాద్‌లోని TGMSC ప్రాంగణంలోనే నిర్వహిస్తారు.
అర్హతలు: అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి చెందిన మైనారిటీ వర్గానికి చెంది ఉండాలి. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన
అభ్యర్థులకు స్టడీ మెటీరియల్, మానసిక అభివృద్ధి కార్యక్రమాలు, పర్సనాలిటీ
డెవలప్‌మెంట్ సెషన్లు వంటి అనేక వనరులు ఉచితంగా అందించనున్నారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆసక్తి కలిగిన అభ్యర్థులు TGMSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Last date
ReplyDeleteST వాళ్లకు లేదా
ReplyDelete