నిరుద్యోగులకు ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ నుంచి తాజాగా నోటిఫికేషన్ (SBI Job Notification) విడుదలైంది. మొత్తం 217 పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు SBI అధికారిక వెబ్సైట్ sbi.co.in లో తమ దరఖాస్తులను సమర్పించుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఖాళీలు 217
- రెగ్యులర్ పోస్టులు 182
- కాంట్రాక్ట్ పోస్టులు 35
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 29, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- మే 19, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
విద్యార్హత
- వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు విద్యార్హతలు, వయో పరిమితికి సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అభ్యర్థుల ఎంపిక
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల ఎంపికలో బ్యాంక్ దే తుది నిర్ణయం అని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment