ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి 2.88 లక్షల రూపాయల వరకు ఉండనున్నది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. యువతలో వృత్తి నైపుణ్యాన్నిపెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
అయితే, ఈ ఉద్యోగ మేళాలో హెటిరో డ్రగ్స్, ఎస్.బి. ఐ పేమెంట్స్, ఎం.ఎస్.మోటార్స్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి.దీనికోసం పదవ తరగతి నుంచి B.SC, MSC, ORGANIC CHEMISTRY, బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొన వచ్చు. ఈ ఉద్యోగ మేళా అక్టోబర్ 13, 2023 వ తేదీ ఉదయం 09:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనున్నది.
ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా ఉపాధికల్పనా అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి 2.88 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ లో రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉద్యోగ మేళా జరుగు ప్రదేశం
గవర్నమెంట్ ఐ. టీ. ఐ కళాశాల డోన్
ముఖ్యమైన తేదీ
13 అక్టోబర్ 2023
సంప్రదించాల్సిన నెంబర్
- K.Subbanna (Placement Executive) - 9440224291
- Gopinath (Skill Hub Co-Ordinator) - 9542643747
- V. Nagavignaswara Reddy (Co-Ordinator) -7981238237
విద్యార్హత
పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు
No comments:
Post a Comment