ఆరోగ్య శాఖా నుండి 10% ఖర్చుతో గ్రామా పంచాయతీలో ఇద్దరినీ నూతనంగా ఉద్యోగాలలోకి తీసుకోవడం జరిగింది. (అన్ని గ్రామాలలో ఇద్దరినీ చొప్పున). ఈ ఇద్దరి ప్రధాన విధి తడి చెత్త, పొడిచెత్త మరియు ఇతర వ్యర్థ పదార్ధాలను ప్రతి ఇంటిముందు ఉన్నటువంటి తడి (ఆకుపచ్చ బుట్ట) , పొడి (నీలం బుట్ట) మరియు ఎలక్ట్రికల్ సంబంధిత (ఎర్ర బుట్ట) ల నుండి చెత్త సేకరించి, సేగ్రిగేషన్ షెడ్ లో వెర్మి కంపోస్ట్ ను తయారు చేసి మండల వ్యవసాయ అధికారులకు అప్పచెప్పడం.
వ్యవసాయ అధికారుల నుండి రైతులు వెర్మి కంపోస్ట్ ను ఉచితంగా తీసుకొని, వారు పండించే పంటలకు వేసే వారు. రైతులకు భూసారం పెరిగి పంటలు బాగా పండాయి. ఎలాంటి రసాయనాలు వాడలేదు. ఇక్కడ రైతులకు రసాయనల ఖర్చు తగ్గింది పైగా అధిక దిగుబడి వచ్చింది.
రైతులు పండించిన పంటలను ప్రజలు కొనుగోలు చేసి ఆహారంగా తీసుకునేవారు తిన్న ఆహారం లో ఎలాంటి రసాయనాలు లేనందున వారి ఆరోగ్యాలకు ఎలాంటి హాని జరుగలేదు. వీరు ఆరోగ్యాంగా ఉన్నందున పని చేసే శక్తి (శ్రామిక శక్తి ) పెరిగింది. పని చేసే శక్తి పెరిగినందున వీరి ఆదాయం పెరిగింది. మరియు అనారోగ్యానికి అయ్యే ఖర్చులు కూడా తగ్గాయి. వారి జీవన ప్రమాణం పెరిగింది.
మొదటగా ఆరోగ్య శాఖ నుండి 10% ఖర్చులను గ్రామాలలో వెర్మి కంపోస్ట్ తయారు కొరకు పెట్టడం జరిగింది. సంవత్సరం తిరిగే సరికి 30% ఆరోగ్య శాఖకు ఖర్చులు ఆదా అయ్యాయి.
ఈ విధంగా అన్ని గ్రామాలలో జరిగింది. రాజ్యంలోని ప్రజలు అందరు వారి యెక్క రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా ప్రజల క్షేమం కోరినందుకు.
No comments:
Post a Comment